Begin typing your search above and press return to search.
రాజకీయాలపై స్మిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 27 July 2020 11:10 AM GMTపాప్ సింగర్ గా అశేష అభిమానులను దక్కించుకున్న స్మిత కొన్ని సినిమాల్లో నటిగా కూడా మెప్పించారు. అయితే ప్రస్తుతం సామాజిక కార్యక్రమాలు మరియు వ్యాపారాలపై దృష్టి పెట్టిన స్మిత తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశారు. ఎక్కువ శాతం మంది నా కులం గురించి పదే పదే అడుగుతున్నారు. నా మొహం మీదే కులం ఏంటీ అంటూ ఉన్నారు. అలాంటి వారిని చూసిన సమయంలో కోపంతో రగిలి పోయేదాన్ని. నేను డిగ్రీకి వచ్చేప్పటి వరకు నా కులం ఏంటో నాకు తెలియకుండానే పెరిగాను. నా కులంతో నాకే ఎలాంటి అవసరం రాలేదు. వాళ్లకు ఎందుకు నా కులంతో అని అర్థం అయ్యేది కాదు.
ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడేవారిని నిలబెట్టి కడిగేయాలన్నంత కోపం వచ్చేది అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇక గతంలో మోడీకి మద్దతుగా ఆల్బం చేయడంతో పాటు అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. చాలా విషయాలను ఆ సమయంలో ప్రస్థావించి మోడీకి మద్దతుగా స్మిత చేసిన పాట అప్పట్లో వైరల్ అయ్యింది. కాని ఇప్పుడు స్మిత మోడీని విమర్శలతో ముంచేస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయమై స్పందిస్తూ తాను మోడీపై పెట్టుకున్న ఏ ఒక్క ఆశ నెరవేరలేదని చెప్పింది.
పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రాజకీయాల గురించి తరచు మాట్లాడుతున్న మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అంటూ ఆమెను ప్రశ్నించిన సమయంలో... రాజకీయాల్లోకి నాకు వచ్చేందుకు ఆసక్తి అయితే లేదు. ఏదైనా పార్టీలో ప్రత్యక్షంగా జాయిన్ అయితే మన సొంత నిర్ణయాలను అమలు చేయలేము. అందుకే ఎన్నికల సమయంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనిపిస్తే ఆ పార్టీ వైపు నడవాలనేది నా అభిప్రాయం. అంతకు మించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలనేది నాకు లేదంటూ స్మిత క్లారిటీ ఇచ్చారు.