Begin typing your search above and press return to search.
స్నాప్‌డీల్ అంబాసిడర్‌గా ఆమిర్‌ఖాన్!
By: Tupaki Desk | 18 March 2015 6:10 AM GMTరీటైల్ మార్కెట్‌ను ఇ-కామర్స్ సైట్లు ముంచెత్తుతున్నాయి. మొన్నటి వరకూ ఏదో ఒకపక్కగా వ్యాపారం చేసుకొంటున్నట్టుగా కనిపించిన ఈ సైట్లు ఇప్పుడు మొత్తం మార్కెట్‌నే సొంతం చేసుకొనే దిశగా ముందుకు వెళుతున్నాయి. పెట్టుబడుల విషయంలో వీటికి బోలెడంత సత్తువ సమకూరుతుండటం.. ఇంటర్నెట్ విస్త-తం అవుతుండటంతో ఇ-కామర్స్ సైట్ల విస్తరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అనేక ఈ కామర్స్ సైట్ల తమ వ్యాపార విస్తరణలో భాగంగా సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చుకొంటున్నాయి. ఇప్పటికే టీవీల్లో షారూక్‌ఖాన్ యప్మీడాట్కామ్ తరపున సందడి చేస్తున్నాడు.
వరల్డ్‌కప్ సందర్భంగా టీవీల్లో వస్తున్న యాడ్స్‌లో యప్మీడాట్కామ్ యాడ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. షారూక్ తో చేయించిన ఆ యాడ్ఫిలిమ్స్ను ఆ వెబ్సైట్ ప్రమోషన్కోసం తెగ వాడుకొంటోంది.
మరి దాని సంగతలా ఉంటే.. ఇప్పుడు స్నాప్‌డీల్ మరో ఖాన్ మీద దృష్టిసారించింది. బాలీవుడ్ ఖాన్‌త్రయంలో ఒకడైన ఆమిర్‌ను స్నాప్‌డీల్ అంబాసిడర్‌గా నియమించుకోనుందని తెలుస్తోంది.
ఈ మేరకు ఒప్పందం కూడా ఖరారైనట్టుగా తెలుస్తోంది. అలాగే మరింత మంది సెలబ్రిటీలపై కూడా స్నాప్‌డీల్ దృష్టిసారించినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే ఇకామర్స్ సైట్ల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారం కోసం ఆ సైట్ల వాళ్లు సెలబ్రిటీలను హైర్ చేస్తున్నారు.