Begin typing your search above and press return to search.

కేవలం ప్రకటనలతోనే ఆ జంట అంత సంపాదిస్తున్నారట

By:  Tupaki Desk   |   27 July 2021 6:36 AM GMT
కేవలం ప్రకటనలతోనే ఆ జంట అంత సంపాదిస్తున్నారట
X
సినీ హీరోయిన్లు అన్నంతనే గ్లామర్ షో తప్పనిసరి అన్న భావన ఉంటుంది. అందుకు భిన్నంగా.. చీరకట్టుతో కోట్లాది మంది మనసుల్ని దోచుకునే నటీమణులుచాలా తక్కువగా ఉంటారు. ఆ కోవలోకే వస్తారు సినీనటి స్నేహ. అందం.. దానికి తగ్గ అభినయంతో ఆమె తెలుగు.. తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచేశారు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని స్నేహ.. తెలుగులో ప్రియమైన నీకు సినిమాతో తన కెరీర్ ను షురూ చేశారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ.. గ్లామర్ గా కనిపించటం కోసం ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఆ మాటకు వస్తే.. మిగిలిన హీరోయిన్ల మాదిరి అందాల ప్రదర్శనకు నో అంటే నో అని చెప్పేవారు.

దీంతో బాపు బొమ్మలా కనిపించే స్నేహకు మహిళా అభిమానులే కాదు.. యూత్ లోనూ క్రేజ్ ఉంది. తెలుగులోసినిమాలు చేస్తూ తమిళంలోనూ సినిమాలు చేసిన ఆమెకు.. అక్కడ పెద్ద ఎత్తునఆఫర్లు వచ్చాయి. దీంతో.. తెలుగులో తక్కువ సినిమాలే చేశారు. తమిళంలో ‘అచ్చాముందు అచ్చాముందు’  అనే సినిమా షూటింగ్ వేళలో హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారటం..తర్వాత వారిద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

2012లో పెళ్లైనప్పటికి ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటించే వారు ఈ దంపతులు. సినీ ప్రపంచంలోని చాలా జంటలకు భిన్నంగా..మేడ్ ఫర్ఈచ్ అదర్ అన్నట్లుగా ఉండే ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో వారికి వాణిజ్య ప్రకటనల్ని జంటగా చేయాలనే ఆఫర్లు తరచూ వస్తుంటాయి. రియల్ లైఫ్ లో మాదిరే రీల్ లైఫ్ లోనూ వీరి జంట సక్సెస్ ఫుల్ అని చెప్పాలి. వీరిద్దరి జోడీ సూపర్ హిట్ కావటంతో పాటు.. షూటింగ్ వేళలోనూ వీరిద్దరు ప్రదర్శించే కమిట్ మెంట్ సైతం పలు వాణిజ్య సంస్థలు వీరితో యాడ్స్ చేయటానికి ఆసక్తిని చూపిస్తారని చెబుతారు.

టాలీవుడ్..కోలీవుడ్ లో మరే సినీ జంటకు లేని రీతిలో క్రేజ్ ఉన్న ఈ జంట కేవలం యాడ్స్ తోనే రూ.3.5కోట్లు సంపాదించారని చెబుతున్నారు. ఇంత భారీగా ప్రకటనల మీద ఆదాయం పొందే అతి కొద్ది మందిలో ఈ జంట ఒకరని చెబుతారు. స్టార్ డమ్ ఉన్నప్పటికి వినయం.. కష్టపడి పని చేసే తత్త్వం ఈ జంటకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు.