Begin typing your search above and press return to search.

బ్రేక‌ప్ అంటూ దుష్ట ప్ర‌చారం చేసిందెవ‌రు?

By:  Tupaki Desk   |   25 Dec 2022 1:46 PM GMT
బ్రేక‌ప్ అంటూ దుష్ట ప్ర‌చారం చేసిందెవ‌రు?
X
గ‌త కొంత‌కాలంగా బాపు బొమ్మ‌ స్నేహ కాపురంలో క‌ల‌త‌ల గురించి మీడియాలో నిరంత‌రం క‌థ‌నాలు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. యువ‌క‌థానాయ‌కుడు అంద‌గాడు అయిన ప్ర‌స‌న్న‌ను పెళ్లాడిన స్నేహ త‌న భ‌ర్త నుంచి దూరంగా ఉంటోంద‌ని ఈ జంట విడిపోయార‌ని కూడా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

అయితే అదంతా త‌ప్పుడు ప్ర‌చారం అని నిరూపిస్తూ తాజాగా స్నేహ‌- ప్ర‌స‌న్న జంట లేటెస్ట్ ఫోటోషూట్ తో క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఫోటోషూట్ లో 'మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్' అనే ప‌దానికి మీనింగ్ ఈ జంట‌ అని నిరూపించింది.

ప్ర‌స‌న్న బ్లాక్ బ్లేజ‌ర్ లో ఎంతో స్మార్ట్ గా కనిపిస్తుంటే.. స్నేహ పింక్ ఫ్రాక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది.

ఈ ఫోటో షూట్ ని రియ‌ల్ యాక్ట్రెస్ స్నేహ ఇన్ స్టా గ్రామ్ లో అధికారికంగా పోస్ట్ చేయ‌డంతో ఈ జంట మ‌ధ్య క‌ల‌త‌లు అంటూ ప్ర‌చారం చేసిన వారికి చెక్ పెట్టిన‌ట్ట‌యింది.

నువ్వు ప‌ర్ఫెక్ట్.. అది నేను చూశాను. ఐ లవ్ యు ఎప్ప‌టికీ.. ఆ త‌ర్వాత‌ నువ్వు ప‌ర్ఫెక్ట్ గా లేవు. అయినా నేను నిన్ను అంత‌కుమించి ప్రేమిస్తున్నాను! అంటూ క్రిప్టిక్ గా త‌న వ్యాఖ్య‌ను జోడించింది స్నేహ‌.

క‌పుల్ షూట్.. జేమ్స్ బాండ్ .. ల‌వ్ యువ‌ర్ సెల్ఫ్‌.. బీ యు అంటూ హ్యాష్ ట్యాగుల‌ను జోడించింది స్నేహ‌. ప్ర‌స్తుతం స్నేహ న‌ర్మ‌గ‌ర్భ‌ వ్యాఖ్యలు అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. అయితే ఆలు మ‌గ‌ల న‌డుమ ప్రేమాప్యాయ‌త‌లు చెక్కు చెద‌ర‌లేద‌ని తాజా ఫోటోషూట్ చెబుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.