Begin typing your search above and press return to search.

హీరోయిన్ స్నేహ బౌలింగ్ వేస్తే..

By:  Tupaki Desk   |   14 Dec 2016 5:23 AM GMT
హీరోయిన్ స్నేహ బౌలింగ్ వేస్తే..
X
మన సినిమా వాళ్లకి కాస్త ఛారిటీ ఎక్కువే. అప్పుడప్పుడూ ఏవైనా సహాయ కార్యక్రమాలుంటే ఆదుకోడానికి మనోళ్లు కూడా ఓ చేయ్యేస్తుంటారు. సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ లంటూ పోటీలే కాదు.. ప్రొగ్రామ్స్ పెడితే గెస్ట్ లుగా కూడా అటెండై తమ సహృదయం చాటుకుంటుంటారు.

రీసెంట్ గా చెన్నైలో హెచ్ఐవీ బాధితుల సహాయార్థం స్వచ్ఛంద సంస్థల కోసం నిధుల సేకరణ జరిగింది. ఇందులో భాగంగా జస్ట్ క్రికెట్ పేరుతో క్రీడా పోటీల్ని నిర్వహించారు. నెల రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నైకి చెందిన 32 జట్లు పాల్గొన్నాయ్. ఫైనల్ మ్యాచ్ ని నందనంలోని వైఎంసీఏ మైదానంలో ఏర్పాటు చేయగా.. దీనికి గెస్ట్ లుగా వచ్చిన సినీ కపుల్స్ స్నేహా ఆమె భర్త ప్రసన్న సరదాగా క్రికెట్ ఆడారు. ప్రసన్న బ్యాటింగ్ చేసినప్పుడు స్నేహా బౌలింగ్.. స్నేహా బ్యాటింగ్ కు ప్రసన్న బౌలింగ్ చేసి చూడటానికి వచ్చిన వాళ్లని ఎంటర్టైన్ చేశారు.

వీళ్లతో పాటు యాక్టర్స్ శ్యామ్ - భరత్ - నరేన్ - బోస్ వెంకట్ - దర్శకుడు వెంకట్ ప్రభు - ప్రేమ్ జీ అమరన్ కూడా అతిథులుగా హజరై పనిలో పనిగా క్రికెట్ కాన్సెప్ట్ తో వచ్చిన చెన్నై-28 పార్ట్ టూ మూవీని ప్రమోట్ చేసుకొన్నారు. సినిమా వాళ్లంతా ఓ చోట చేరి బ్యాట్.. బౌల్ పట్టే సరికి ఛారిటీ కార్యక్రమానికి నిధులు కూడా బానే వచ్చాయ్.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/