Begin typing your search above and press return to search.

స్నేహ రీ-ఎంట్రీ అలా ఖాయమైంది!!

By:  Tupaki Desk   |   14 Aug 2016 4:08 AM GMT
స్నేహ రీ-ఎంట్రీ అలా ఖాయమైంది!!
X
తెలుగుతో పాటు సౌత్ లోని పలు భాషల్లో హీరోయిన్ పాత్రలతో పాటు.. కేరక్టర్ కి ప్రాధాన్యం ఉంటే వదిన అనిపించే రోల్స్ లో కూడా నటించేసింది స్నేహ. తెలుగులో చివరగా సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్రకు భార్యగా నటించిన ఈమె.. కొన్నాళ్లుగా బ్రేక్ తీసుకుంది. ప్రెగ్నెంట్ కావడంతోనే ఇలా కెమేరాకు దూరం కావాల్సి వచ్చిందన్న విషయం తెలిసిందే.

2015 ఆగస్టులో విహాన్ కు జన్మనిచ్చింది స్నేహ. అక్కడి నుంచి పిల్లాడి ఆలనా పాలనాతో సరిపోయింది. ఇలాంటి టైమ్ లో ఆమె దగ్గరకు మలయాళ స్టార్ హీరో ముమ్మట్టి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా ముమ్మట్టికి భార్య రోల్. ఫ్యామిలీ డ్రామా అయినా థ్రిల్లర్ అంశాలు కూడా ఇందులో చాలా ఉంటాయట. ఈ ప్రాజెక్టు అనుకున్నపుడే స్నేహను ఫస్ట్ ఆప్షన్ గా భావించారు. కానీ ఆమె చేస్తుందో చేయదో అనే అనుమానంతో నయనతార సహా పలువురిని పరిశీలించారట.

చివరకు స్నేహను ఓ సారి అడిగి చూద్దామని అనుకుని ప్రపోజల్ పంపారు. పిల్లాడి వయసు ఇంకా ఏడాది మాత్రమే కావడంతో.. మొదట ఆలోచించిన స్నేహ.. కథ విన్న తర్వాత ఏ మాత్రం ఆలోచించకుండా సైన్ చేసేసిందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిపోవడంతో.. మరో రెండు వారాల్లో షూటింగ్ మొదలుపెట్టేయనున్నారు.