Begin typing your search above and press return to search.

అలాంటప్పుడు రియాక్ట్ ఎందుకయ్యావ్‌??

By:  Tupaki Desk   |   21 Dec 2015 3:30 PM GMT
అలాంటప్పుడు రియాక్ట్ ఎందుకయ్యావ్‌??
X
ఇప్పుడు తమిళనాట అంతా మార్మోగిపోతున్న సాంగ్‌.. బీప్‌ సాంగ్‌.. అమ్మాయిలను ప్రేమించకండి.. కేవలం వారితో వన్‌ నైట్‌ స్టాండ్స్‌ మాత్రమే గడపండి.. అంటూ హీరో శింబు బూతులతో కూడిన ఒక పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట గురించి చాలామంది సెలబ్రిటీలు రియాక్ట్‌ అవ్వడానికి ససేమిరా అంటుంటే.. హీరోయిన్‌ స్నేహ మాత్రం కొత్త బాస్యం చెప్పింది.

''అసలు ఇలాంటి పాటలపై రియాక్టు అవ్వడమే తప్పు. మనం మాట్టాడుకునే కొద్ది.. ఆ పాటలకు ఇంకా క్రేజ్‌ పెరుగుతుంది. దాని వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. అయినా బూతులతో పాటేంటి? ఇప్పటివరకు నేనూ ఆ పాటను వినలేదు. కాకపోతే బూతులతో పాడాడని అంటున్నారు కాబట్టి.. ఇప్పుడు వినాలని అనిపిస్తోంది'' అంటూ స్నేహ కామెంట్లు చేయడం .. ఇప్పుడు తమిళ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. అయితే.. ప్రచారం చేయకండి అంటూ స్నేహ చేసిన ఈ ప్రచారం గురించి ఏమనాలి మరి?

తక్కిన సెలబ్రిటీల టైపులో స్నేహ కూడా 'నో కామెంట్‌' అని చెప్పేసి ఉంటే.. ఏ గోలా ఉండేది కాదు. కాని అమ్మడు మాత్రం తనకు తోచిన రీతిలో ఒక ఫిలాసఫి చెప్పింది. ఇది పెద్ద న్యూస్‌ అయిపోయి.. బీప్‌ సాంగ్‌ కు ఇప్పుడే అసలుసిసలైన ప్రమోషన్‌ వస్తోంది. ఈ విషయం తెలుసుకోకుండా ఆ పాట గురించి రియాక్ట్‌ ఎందుకయ్యిందో మన స్నేహ!!