Begin typing your search above and press return to search.

చీరందంలో స్నేహారెడ్డి సిగ్గు అందం!

By:  Tupaki Desk   |   23 Dec 2022 7:53 AM GMT
చీరందంలో స్నేహారెడ్డి సిగ్గు అందం!
X
ఒక‌ప్పుడు టాలీవుడ్ హీరోల భార్య‌లంటే ఎలా ఉంటారో? చాలా మందికి తెలిసేదికాదు. సెల‌బ్రిటీ కుటుంబాలు కేవ‌లం ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌కు త‌ప్ప సినిమా వేడుక‌ల్లో ఎక్క‌డా క‌నిపించేవారు కాదు. ఫ‌లానా హీరో ఫ‌లానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట! అని మాట్లాడుకోవ‌డం మించి బ‌య‌ట జ‌నాల‌కి ఇంకేం తేలియ‌దు. నేడు మారిన సీన్ తెలిసిందే.

హీరోల‌తో పాటు.. హీరోల భార్య‌ల‌కు క్రేజ్ మామూలుగా ఉండ‌టం లేదు. హీరో ప‌క్క‌న లేక‌పోయినా ఎక్క‌డైనా క‌నిపిస్తే వాళ్ల‌తో పాటు సెల్పీలు దిగ‌డానికి అభిమానులు ఎగ‌బ‌డుతున్న స్థాయికి దేశం ఎదిగింది. అంతా సోష‌ల్ మీడియా మ‌హిహ అని! ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సామాజిక మాధ్య‌మాలు అందుబాటులోకి వ‌చ్చిన తర్వాత సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో ఏం జ‌రుగుతుం దో? క్ష‌ణాల్లో క‌ళ్ల ముందుంటుంది.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా గురంచైతే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌న్నీని పెళ్లాడిని నాటి నుంచి కొంగున క‌ట్టేసుకుని బ‌న్నీ సోష‌ల్ మీడియా ప‌నుల‌న్నింటిని ఆమె చూస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా స్నేహ అంతే ఫేమ‌స్ అవుతున్నారు. ఎప్ప‌క‌ప్పుడు న్యూ ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో మెరిసిపోతున్నారు. హీరోయిన్ల‌కే పోటీగా ఇన్ స్టా మాధ్య‌మాల్లో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారు.

తాజాగా స్నేహారెడ్డి చీరందంలో త‌ళుకులీనారు. ఇదిగో ఇక్క‌డిలా క్రీమ్ క‌ల‌ర్ సారీలో..మ్యాచింగ్ ర‌విక‌లో ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు. న్యూ మోడ‌ల్ డిజైన్డ్ చెవులీలు...బ్యాంగిల్స్.. సారీ అందంపై ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ని అని ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతున్నాయి. అలాగే స్నేహా హెయిర్ స్టైల్...ఫేస్ మ్యాక‌ప్....లిప్ స్టిక్ ...ఐబ్రోస్ ప్ర‌తీది ఆమెని మ‌రింత అందంగా మ‌లిచాయి.

స్నేహ‌ని ఇంత అందంగా స్టైల్ చేసింది ప్ర‌ఖ్యాత స్టైలిస్ట్ జుకాల్క‌ర్...సారీ డిజైన‌ర్ అనుష్ రెడ్డి. ఇంత అందంగా ఆమెని క్యాప్చ‌ర్ చేసింది వేణురాసూరి. ప్ర‌స్తుతం ఈఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు స్నేహ అందాన్ని త‌మ‌దైన శైలిలో పొగిడేస్తున్నారు. స్నేహికి ఇన్ స్టాలో భారీగా ఫాలోవ‌ర్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.