Begin typing your search above and press return to search.
అన్ లక్కీ హీరోయిన్‌కు పదేళ్లు
By: Tupaki Desk | 7 April 2015 3:30 PM GMTకొన్ని సినిమాలకు 25 రోజులు, 50 రోజుల పోస్టర్లు వేస్తుంటారు. కానీ సినిమా మాత్రం ఎక్కడా ఆడుతూ ఉండదు. థియేటర్ల నుంచి ఎప్పుడో ఎత్తేసి ఉంటారు. అంటే ఆ సినిమా విడుదలై 50 రోజులైందని అనుకోవాలి తప్పితే.. 50 రోజులు ఆడిందని కాదు. ఇప్పుడు స్నేహా ఉల్లాల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లయిందట. పదో వార్షికోత్సవం సందర్భంగా ఎ ఎగ్జయిటైపోతోంది ఈ నీలికళ్ల సుందరి. సరిగ్గా పదేళ్ల కిందట సల్మాన్ ఖాన్ పరిచయం చేశాడీ ముంబయి భామను.
స్నేహ తొలి సినిమా పేరు లక్కీ కావడం విశేషం. కానీ ఆమె కెరీర్‌ను చూస్తే చాలా అన్‌లక్కీ అనిపిస్తుంది. సల్మాన్ సినిమాతో అరంగేట్రం చేసినా.. తెలుగులోనూ రెండు మంచి హిట్లు కొట్టినా అవేమీ ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టలేదు. జూనియర్ ఐశ్వరారాయ్‌గా ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించిన స్నేహ.. టాలీవుడ్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా లాంటి హిట్ సినిమాల్లో నటించినా ఫలితం లేకపోయింది. సింహా బ్లాక్‌బస్టర్ హిట్టవడంతో తన దశ తిరిగిపోతుందని ఆశించింది కానీ.. అదేమీ జరగలేదు. ఇప్పుడామెను పట్టించుకునే నాథుడే లేడు. ఏవో ఫొటో షూట్లు అవీ చేసుకుంటూ కాలం గడిపేస్తోంది. పదేళ్ల ల్యాండ్‌మార్క్ అందుకున్న సందర్భంలో ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసి.. ఓ బిజినెస్‌మేన్‌ను చూసి పెళ్లాడేస్తే ఓ పనైపోతుందేమో!