Begin typing your search above and press return to search.

జీవితంలో మొదటిసారి ఆస్పత్రిపాలైందట!

By:  Tupaki Desk   |   3 Jun 2019 12:19 PM GMT
జీవితంలో మొదటిసారి ఆస్పత్రిపాలైందట!
X
సోషల్ మీడియా అనగానే హీరోయిన్లు ఎప్పుడూ హాట్ ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తారని అనుకోవడం పొరపాటు. అప్పుడప్పుడూ జస్ట్ ఫర్ ఎ చేంజ్ గ్లామర్ లేని ఫోటోలు కూడా పోస్ట్ చేస్తారు. హీరోయిన్ స్నేహా ఉల్లాల్ అందుకు ఒక ఉదాహరణ. స్నేహ తెలుసు కదా? బాలకృష్ణ సూపర్ హిట్ ఫిలిం 'సింహా' లో హీరోయిన్. హిందీ.. తెలుగు.. కన్నడ.. బెంగాలి.. ఇలా అన్ని భాషల్లో నటించింది. స్నేహకు ఈమధ్య హై ఫీవర్ వచ్చిందట. దీంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది.

ఆ విషయం తెలుపుతూ హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు క్యాప్షన్ గా "జీవితంలో మొదటిసారి ఆసుపత్రి పాలయ్యాను. విపరీతమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నాను. ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. భయం అనిపించింది.. కానీ కొంత సమయం తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఎంత వీలైతే అంత విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అది బోరింగ్ గా ఉంటుంది కదా.. అయితే నాతో నెట్ ఫ్లిక్స్ ఉంది. నాపట్ల కేర్ తీసుకునే మనుషులు నాతో ఉన్నారు. వీలైనంత త్వరగా మళ్ళీ వర్క్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నా.. మీ అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేసింది.

సినిమాల విషయానికి వస్తే స్నేహకు గత నాలుగేళ్ళుగా ఆఫర్లు లేవు. తన చివరి చిత్రం హిందీలో 'బేజుబాన్ ఇష్క్'. తెలుగులో అయితే 'అంతా నీమాయలోనే'... ఈ సినిమా అసలు రిలీజ్ అయిందో లేదో కూడా ఎవరికీ తెలియదు.