Begin typing your search above and press return to search.
నెలల గర్భంతో బాపు బొమ్మ సాహసం!
By: Tupaki Desk | 19 Jan 2020 6:58 AM GMTధనుష్ కథానాయకుడిగా నటించిన పటాస్ సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఆడిమురై అనే వర్మకళ ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమాని రూపొందించారు. దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ థ్రిల్లర్ ద్వితీయార్థం ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో బాపు బొమ్మ స్నేహ నటనకు గొప్ప పేరొచ్చింది. వర్మ కళ (ఆడిమురై)ను నేర్చుకునే విద్యార్ధినిగా..అలాగే విద్య నేర్పించే గురువు గానూ స్నేహ నటించింది. అడిమురై శిక్షణ కోసం స్నేహ ఎంతో కఠోరంగా శ్రమించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
స్నేహ ఈ మూవీ కోసం ఎవరూ ఊహించలేని ఓ సాహసం చేసింది. మూడు నెలల పాటు కఠోర శిక్షణ కోసం చాలా కఠోరంగా శ్రమించింది. వర్మకళను నేర్చుకోవడం అంటే ఎంతో ఏకాగ్రతతో కూడుకున్న పని...ఎంతో క్లిష్టమైనది అని స్నేహ తెలిపింది. అలాగే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడే స్నేహం గర్భం దాల్చిందిట. ఆ విషయం తెలిసీ.. సినిమా నుంచి తప్పుకోకుండా గర్భంతోనే రకరకాల విద్యల కోసం శిక్షణలో పాల్గొన్నట్లు తెలిపింది. తన ఇంట్లోనే వర్మ కళ నిపుణుడు శిక్షణనిచ్చారట. అందుకు అవసరమైన సహకారం చిత్రబృందం నుంచి అందిందట.
ఇందులో ఓ సీన్ ప్రకారం చెన్నైలోని గిండి ప్లై ఓవర్ వద్ద పోరాట సన్నివేశంలో స్నేహ అడిమరై కళను ప్రయోగిస్తుంది. అప్పటికి స్నేహ నాలుగు నెలల గర్భిణి అట. అయినా నటనపై తనకు ఉన్న ఫ్యాషన్ ని నిలువరించలేకపోయింది. కష్టమే అయినా.. ఆ సీన్లో పట్టు బట్టి మరీ డూప్ ఎవరూ లేకుండా తనే నటించిదిట.. ఆ సమయంలో స్నేహ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని సెట్స్ కి డాక్టర్ల బృందాన్ని తీసుకొచ్చారుట. ఆ సీన్ తెరకెక్కించే సమయంలో టెక్నీషిన్లతో పాటు... డైరెక్టర్ ఎంతో భయపడి టెన్షన్ కు గురయ్యారుట. కానీ స్నేహ మాత్రం ఎలాంటి టెన్షన్ ఫీలవ్వకాకుండా రిలాక్స్ డ్ గా నటించిందని దర్శకుడు తెలిపాడు.