Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: కొడుకుతో సీనియర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   15 May 2018 6:32 AM GMT
ఫోటో స్టోరీ: కొడుకుతో సీనియర్ బ్యూటీ
X
సీనియర్ బ్యూటీ స్నేహ.. ఒకప్పుడు ట్యాలెంటెండ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ తన యాక్టింగ్ తోనే పేరు తెచ్చుకున్న.. అరుదైన భామల్లో స్నేహ పేరు కూడా తప్పకుండా ఉంటుంది. ఆరేళ్ల క్రితం ప్రసన్న అనే తమిళ యాక్టర్ ను పెళ్లి చేసుకున్న స్నేహ.. ప్రస్తుతం కుటుంబంతో బోలెడంత సంతోషంగా గడుపుతోంది.

స్నేహ భర్త ప్రసన్న.. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. రీసెంట్ గా సాయిధరం తేజ్ మూవీ జవాన్ లో కూడా యాక్ట్ చేశాడు. 2012లో స్నేహ-ప్రసన్నలు వివాహం చేసుకోగా.. 2016లో వీరికి ఓ కొడుకు పుట్టాడు. విహాన్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు విహాన్ వయసు రెండున్నరేళ్లు. తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ఓ ఫోటో.. చూడముచ్చటగా ఉంది. కొడుకుని ఉప్పు ఎక్కించుకుని స్నేహ ఆటలాడుతున్న పిక్.. అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాల్లో ఎలా కనిపించేదో.. ఇప్పటికీ అంతే చూడ చక్కగా మెరిసిపోతున్న స్నేహ.. కొడుకు వంక చూసుకుంటూ తెగ మురిసిపోతోంది.

మరోవైపు కెమెరా వంకే కన్నార్పకుండా చూస్తూ.. భలే పోజ్ ఇచ్చాడు విహాన్. తల్లీ కొడుకులు ఇద్దరూ కలిసి ఆడుకుంటున్న ఫోటో రియల్లీ క్యూట్ అనాల్సిందే. పెళ్లి తర్వాత యాక్టింగ్ విషయంలో బాగా స్లో అయిన స్నేహ.. అడపా దడపా మాత్రం మంచి మంచి పాత్రలతో అలరిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర భార్యగా కనిపించిన స్నేహ.. తన నటనతో ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయమే.