Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కి అడ్డు పడుతున్న తుఫాన్
By: Tupaki Desk | 23 Jan 2016 1:30 PM GMTయంగ్ టైగర్ కి ప్రకృతి సహకరించడం లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఓ రికార్డ్ సృష్టించకుండా మంచు తుఫాన్ అడ్డుపడుతోంది. అమెరికా వ్యాప్తంగా భయంకరమైన మంచు తుఫాన్ కురుస్తోంది. చిన్నా చితకా పనులు చేసుకోవడానికి కుదరడం లేదు. ఆఖరికి విమాన సర్వీసులు కూడా రద్దు చేసేశారు. ఇప్పటికే 8 మంది తుఫాన్ ధాటికి చనిపోగా, 6 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కూడా విధించేంతటి స్థాయిలో మంచు కురుస్తోంది.
ఈ ప్రభావం సినిమాలపై కూడా భారీగానే పడుతోంది. దాదాపు చాలా ప్రాంతాల్లో థియేటర్లను మూసివేశారు. షోలు వేస్తున్న కొన్ని చోట్ల కూడా పగటి వేళ మాత్రమే అతి తక్కువ ప్రదర్శనలు పడుతున్నాయి. ఇంతటి ప్రకృతి బీభత్సం ఎన్టీఆర్ -సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతోపై భారీగానే పడింది. ఇప్పటికే ఎన్టీఆర్ కి అన్ని ప్రాంతాల్లోనూ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ఈ మూవీ.. యూఎస్ లో కూడా ఈ రికార్డ్ సాధించింది. ఏడు రోజుల్లో 1.77 మిలియన్ డాలర్ల వసూళ్లతో చరిత్ర సృష్టించి.. అక్కడ టాప్ 5లోకి ఎంటర్ అయిపోయింది.
రెండు మిలియన్ డాలర్ల మార్క్ ను ఖచ్చితంగా అందుకుంటుందన్న సమయంలో మంచు తుఫాన్ తీవ్రం అవడంతో.. ఈ శుక్రవారం కేవలం 22వేల డాలర్లు మాత్రమే వసూలయ్యాయి. వీటితో కలిసి మొత్తం 1.79మిలియన్ డాలర్లను ఈ సినిమా కొల్లగొట్టింది. వీకెండ్ లో తుఫాన్ ప్రభావం తగ్గితే వసూళ్లు ఊపందుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఇదే పరిస్థితి మంచి టాక్ తో దూసుకుపోతున్న నాగార్జున సోగ్గాడే చిన్నినాయన - శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజాపై కూడా పడింది.