Begin typing your search above and press return to search.
అలా.. చార్ట్ బస్టర్లు కావాలని అడిగిన మహేష్?
By: Tupaki Desk | 20 Dec 2020 6:00 AM GMT2020 సంక్రాంతి బరిలో రిలీజైన అల వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా వసూళ్లు సాధించాయి. అయితే సరిలేరు నీకెవ్వరు మ్యూజిక్ తో పోలిస్తే.. అల మ్యూజిక్ బంపర్ హిట్టు అన్న టాక్ వచ్చింది. `అల వైకుంఠపురములో` అన్ని పాటలు చార్ట్ బస్టర్ జాబితాలో నిలిస్తే `సరిలేరు...` నుంచి ఒకటీ అరా మాత్రమే ఆ స్థాయిని అందుకున్నాయి. కారణం ఏదైనా దేవీశ్రీపై ఎస్.ఎస్.థమన్ పై చేయి సాధించాడన్నది వాస్తవం.
ఇక దేవీశ్రీ రొటీన్ మ్యూజిక్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం థమన్ ని నెటిజనం ఆకాశానికెత్తేయడం తెలిసినదే. కారణం ఏదైనా కానీ ఇప్పుడు టాలీవుడ్ లో థమన్ హవా నడుస్తోంది. అంతటా థమనే కనిపిస్తున్నాడు. అల ఇచ్చిన స్ఫూర్తి అనాలో లేక జాగ్రత్త అనాలో కానీ.. మహేష్ వెంటనే థమన్ ని లాక్ చేశాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలోని సర్కార్ వారి పాట కోసం థమన్ బాణీల్ని సిద్ధం చేస్తున్నాడు. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా బాణీల్ని అందించాలని మహేష్ సూచించారట.
ఇక మహేష్ - థమన్ కాంబినేషన్ అనగానే బిజినెస్ మేన్ - దూకుడు- ఆగడు వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాల పాటలు బీజీఎం ప్రతిదీ ఆకట్టుకున్నాయి. అందువల్ల ఇప్పుడు మరోసారి సేమ్ కాంబినేషన్ రిపీటవుతోంది అనగానే ఘట్టమనేని అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. సంగీతం విషయంలో అంతకుమించి అంచనాలు ఏర్పడ్డాయి. అన్నట్టు ఈ ఊపులో థమన్ కాపీ ట్యూన్లు ఇవ్వడమే బాలేదంటూ ఇటీవల కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాటన్నిటినీ అధిగమించి పూర్తిగా ఏ.ఆర్.రెహమాన్ లా ఒరిజినల్ ట్యూన్స్ ని వినిపించే ప్రయత్నం చేస్తే బావుంటుందన్నది అభిమానుల సూచన. తనను నమ్మిన మహేష్ కోసం ఆమాత్ర శ్రద్ధ పెడతారని అంతా భావిస్తున్నారు.
ఇప్పటికే థమన్ కూడా ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ కొన్ని చేసారట.మహేష్ కోసం ఇంట్రడక్షన్ సాంగ్ .. బీజీఎం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజైన `సర్కార్ వారి పాట` మోషన్ పోస్టర్ టీజర్ లో థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా చార్ట్ బస్టర్లు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నాయిక. మైత్రి మూవీ మేకర్స్ - 14 రీల్స్ -జీఎంబీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.