Begin typing your search above and press return to search.
నెట్ ఫ్లిక్స్ ఆత్రం వెనుక ఇంత ఉందా?
By: Tupaki Desk | 18 Jan 2023 2:30 AM GMT తెలుగు సినిమాలకు ఓటీటీల వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం ఉందనేది కాదనలేని వాస్తవం. ఎలా అయినా థియేటర్ల వ్యవస్థని బతికించాలని కంకణం కట్టుకున్న టాలీవుడ్ నిర్మాతలు ఆ మధ్య ఓటీటీ రిలీజ్ ల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఎనిమిది వారాల ఓటీటీ రిలీజ్ గ్యాప్ ఉంచాలని చెబుతూనే... ఆ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయాన్ని కూడా థియేటర్లో ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలా చేస్తే ఎలాగూ ఆ ఓటీటీ సబ్స్క్రిప్షన్ మన దగ్గర ఉంది కదా అని ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా లైట్ తీసుకునే అవకాశం ఉందని నిర్మాతలు ఈ విధంగా ఆలోచించి ఉండవచ్చు. కానీ వాళ్లు అలా ప్రకటించిన సరే అది ఏ మాత్రం అమల్లోకి రావడం లేదు.
తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయో ఆ విషయాన్ని థియేటర్లో ప్రదర్శించారు. పోని రాబోయే సినిమాల ప్రదర్శించే సమయంలో వాటిని ఏమైనా అరికడదాం అనుకుంటే తాజాగా నెట్ ఫిక్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దాదాపుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ తాము కొనుక్కున్న సినిమాలకు సంబంధించి అప్డేట్స్ వరుసగా రిలీజ్ చేసింది.
ఈ సినిమా మాదే ఇది మేమే కొన్నాం... తెలుగు సహా ఫలానా భాషల్లో విడుదల చేస్తున్నాము అంటూ... ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలతో పాటు అసలు షూటింగు కూడా ప్రారంభం కాని సినిమాలను కూడా ప్రకటించేసింది.
చిరంజీవి భోళాశంకర్ మొదలు మహేష్ బాబు 28, కళ్యాణ్ రామ్ అమిగోస్, నాని దసరా, సిద్దు జోనల్ గడ్డ టిల్లు స్క్వేర్, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, వైష్ణవ తేజ్ నాలుగో సినిమా, వరుణ్ తేజ్ 12 ఇలా వరుస సినిమాలతో రచ్చ రేపింది.
అయితే ఇలా చేయడం నిర్మాతలకు ఒకపక్క షాక్ ఇస్తున్న ఇలా చేయడం వెనక నెట్ ఫ్లిక్స్ స్ట్రాటజీ వేరే ఉందని మాట వినిపిస్తోంది. ఎందుకంటే మిగతా ఓటీటీ ఫ్లాట్ ఫాం తో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ కి ధరలు ఎక్కువ కావడంతో ఎక్కువమంది నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. ఒకానొక దశలో నెట్ ఫ్లిక్స్ భారీగా సబ్స్క్రైబర్లు కూడా కోల్పోయిన నేపథ్యంలో ఇలాంటి స్ట్రాటజీలను తెరమీదకి తీసుకొచ్చిందని అంటున్నారు.
ఇలా ఈ సినిమాలన్నీ మా దగ్గరే ఉన్నాయని తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకరకంగా తమ సబ్స్క్రైబర్లుగా చేసుకునే స్ట్రాటజీతోనే ఇలా వరుస సినిమాలు ప్రకటించిందని అంటున్నారు. అయితే అసలు సినిమా థియేటర్లలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుందో చెప్పకూడదంటూ ఆంక్షలు విధించిన నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.