Begin typing your search above and press return to search.
లక్ష కోట్లు ఆస్తి ఉన్న తెలుగు హీరో అతనే
By: Tupaki Desk | 11 May 2020 4:13 PM GMTఒకప్పుడు సంచలనాలకు మారుపేరుగా నిలిచిన టాలీవుడ్ అందగాడు శోభన్‌బాబుకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన సినిమా ఎలా ఉన్నా ఆయన వేసే స్టెప్పులకు ముగ్ధులై థియేటర్లకు వెళ్లేవారట. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'సోగ్గాడు' సినిమాలో ఆయన చేసిన నృత్యం ఇప్పటికీ కొందరిని ఆకర్షిస్తుంటుంది. 'సోగ్గాడు' సినిమా శోభన్‌బాబు జీవితంలో మైలురాయి సినిమాయే కాకుండా ఆయన స్టెప్పులు మొదలు పెట్టిన సినిమా కూడానట. శోభన్‌బాబు 'సోగ్గాడు' సినిమా బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్టు సాధించింది. అంతేకాకుండా ఆయనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఈ సినిమాకు రావడం విశేషం.
సినిమాల్లో హీరోగా వెలుగు వెలిగిన వారంతా డబ్బును ఎలా దాచుకోవాలి.. పొదుపు చేయాలో తెలియక దెబ్బైపోయిన వారు ఎందరో.. ఇటీవలే డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాద్ తాను 100 కోట్లు స్నేహితులను నమ్మి మోసపోయానని తెలిపారు.
ఇక సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో బాగుపడింది ఒక్క అలనాటి హీరో శోభన్ బాబు మాత్రమే. ఆయన సలహాతో మురళీ మోహన్ కూడా భారీగా నాడు భూములు హైదరాబాద్ లో కొని ఇప్పుడు వేలకోట్లకు అధిపతి అయ్యాడు.
శోభన్ బాబు తనను కలిసిన ప్రతీ ఆర్టిస్టును సంపాదించిన సొమ్మును వడ్డీ వ్యాపారానికో మరో దానికో కాకుండా భూమిపైన పెట్టుబడి పెట్టాలని సూచించేవాడట.. భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికి పోదని చెప్పేవాడట.. ఆయన చెప్పడమే కాదు.. ఏకంగా తన సంపదనంతా భూములపైనే పెట్టాడు. మద్రాస్ లో కొన్ని వేల ఎకరాలు కొన్నాడు. అవి ఇప్పుడు లెక్కలు వేస్తే వేలకోట్లు అయ్యాయి. శోభన్ బాబు చనిపోయిన నాటికే ఆయన ఆస్తి ఏకంగా 80 వేల కోట్లు ఉంటుంది. ఇప్పటికి పోలిస్తే ఏకంగా లక్షకోట్లు దాటుతుంది. దక్షిణాది హీరోల్లో శోభన్ బాబే నంబర్ 1 ఆస్తి పరుడు అని మురళీ మోహన్ అప్పట్లో చెప్పాడు కూడా.. సో ఇప్పటికైనా టాలీవుడ్ పెద్దలు మీ సంపదనంత భూములపైనే పెడితే బాగుపడతారని తెలుసుకోండి..