Begin typing your search above and press return to search.

తెనాలి బ్యూటీ మహా బోల్డ్ గురూ!

By:  Tupaki Desk   |   31 July 2018 6:34 AM GMT
తెనాలి బ్యూటీ మహా బోల్డ్ గురూ!
X
గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న ముంబై బ్యూటీలకు సౌత్ బ్యూటీలకు ఓ విషయంలో చాలా తేడా ఉంటుంది. మన వాళ్ళకు కొన్ని విషయాల్లో సంకోచాలు ఉంటాయి. కొన్ని బోల్డ్ టాపిక్స్ మీద మాట్లాడరు...బోల్డ్ సీన్స్ లో ఇబ్బందిపడకుండా యాక్ట్ చేయలేరు. అదే బాలీవుడ్ బ్యూటీలను తీసుకోండి సెక్సువల్ ఓరియెంటేషన్.. ఫేవరెట్ సెక్స్ పొజిషన్.. ఫస్ట్ ఎక్స్పీరియన్స్.. ఇలా ఏదైనా మాట్లాడతారు. మీరు కనుక ట్రెడిషనల్.. ఆర్థోడాక్స్ అయితే అవి విన్నవెంటనే మీకు గుండెపోటు రావడం.. కుయ్యి కుయ్యి మంటూ 108 రావడం నిముషాల్లో రావడం ఖాయం.

మరి ఇలాంటివాళ్ళకు గట్టి పోటీ ఇవ్వడానికి మనకూ ఇప్పుడొక తెలుగు బ్యూటీ రెడీ అయింది. ఆమె మిస్ ఇండియా విన్నర్ అయిన శోభిత ధూళిపాళ. ఇంకా వాళ్ళంత దూరం అయితే పోలేదు కానీ దాదాపు హిందీ వాళ్ళకు తెలుగు వాళ్ళు ఏమీ తీసిపోరన్నట్టుగా బోల్డ్ గా మాట్లాడుతోంది. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో తను 20 ఏళ్ళ వయసులో ఎందుకు మిస్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొందో చెప్పుకొచ్చింది... తన కాలేజ్ లో ఉండే అందమైన అబ్బాయిలను ఆకర్షించడానికట! మోడలింగ్ అంటే ఇష్టమని సోది చెప్పకుండా ఇంత ఓపెన్ గా చెప్పడం విశేషమే. టీనేజ్ లో శరీరంలో వచ్చే మార్పులు తనను ఏదో చెయ్యమని చెప్పేవని అందుకె ముంబై లో మోడలింగ్ కెరీర్ లో అడుగుపెట్టానని చెప్పింది.

అంతే కాదు. తన బాలీవుడ్ డెబ్యూ ఫిలిం 'రమణ్ రాఘవ్' సినిమా ఫస్ట్ డే షూట్ ఒక మరపురాని సంఘటన అని చెప్పుకొచ్చింది. ఆ రోజు సీన్ లో దాదాపు నగ్నంగా నటించాల్సి వచ్చిందని, అదే సమయంలో తన తల్లి నుండి కాల్ వచ్చిందట. ఆమె శోభితను ఏం డ్రెస్ వేసుకున్నావని అడిగిందట!

శోభిత తెలుగు డెబ్యూ ఫిలిం 'గూఢచారి' త్వరలో రిలీజ్ కు సిద్ధం గా ఉంది. హిందీలో ఇమ్రాన్ హష్మి సినిమా- మలయాళంలో నివిన్ పౌలి సినిమాలు సైన్ చేసిందట. చూస్తుంటే ఈ తెనాలి బ్యూటీ గ్లామర్ ఇండస్ట్రీ తాట తీసేలానే ఉంది.