Begin typing your search above and press return to search.

లాజిక్ మిస్ అయితే.. ఈ ఆవేద‌న పోస్ట్ ఏంటమ్మ‌?

By:  Tupaki Desk   |   1 March 2019 6:35 AM GMT
లాజిక్ మిస్ అయితే.. ఈ ఆవేద‌న పోస్ట్ ఏంటమ్మ‌?
X
కొంత‌మంది ప్ర‌ముఖులు.. సెల‌బ్రిటీలు అదే ప‌నిగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. అందులో లాజిక్ అన్న‌ది ఉండ‌దు. త‌మ మ‌న‌సుకు తోచింది సోష‌ల్ మీడియాలో బ‌రాబ‌రా పోస్టు రూపంలో పెట్టేయ‌ట‌మే కానీ.. ప్రాక్టిక‌ల్ గా ఆలోచించ‌టం.. ఎందుకిలా? జ‌రిగింద‌న్న క్వ‌శ్చ‌న్ త‌మ‌కు తాము వేసుకోక‌పోవ‌టం లాంటివి లేక‌పోగా.. చిట్టి మెద‌డుకు త‌ట్టిన చిన్న ఆలోచ‌న‌ను ఎడాపెడా రాసేస్తుంటారు. జ‌నాల్ని సైడ్ ట్రాక్ ఎక్కిస్తుంటారు.

తాజాగా అలాంటి ఉదంత‌మే ఎదురైంది గూఢ‌చారి ఫేం శోభితా ధూళిపాళ్ల‌. తాజాగా అమ్మ‌డు ఒక హిందీ సినిమాలో న‌టిస్తోంది. అందులో ముస్లిం పాత్ర‌ను పోషిస్తోంది.ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. అమ్మ‌డు షూటింగ్ కు వెళ్లి.. అక్క‌డి ముస్లిం అమ్మాయి క్యాస్టూమ్స్ తో హోట‌ల్ కు వ‌చ్చింద‌ట‌. త‌న పేరు మీద ఉన్న రూం తాళం అడిగితే నో చెప్పార‌ట‌. బుర‌ఖా వేసుకున్న త‌న విష‌యంలో హోట‌ల్ సిబ్బంది ప్ర‌వ‌ర్తించిన తీరు త‌న‌కు మ‌స్తు ఆవేద‌న క‌లిగించిన‌ట్లు చెప్పుకున్నారు.

అయితే.. ఆమె మాట‌ల్లో మిస్ అయిన లాజిక్కు ఏమంటే.. ఆమె పేరు మీద హోట‌ల్ రూం బుక్ అయ్యింది. అంటే.. మ‌న‌కున్న ప‌రిమిత తెలివితో చూస్తే.. శోభితా అనే పేరుతో మీద రూమ్ బుక్ అయితే.. బుర‌ఖా వేసుకున్న ఒక అమ్మాయి వ‌చ్చేసి.. రూం నెంబ‌రు చెప్పి తాళాలు అడిగితే ఇచ్చేస్తారా?

బుర‌ఖా లేకుంటే ఆమెను గుర్తు ప‌ట్టే వారేమో? అలాంటిదేమీ లేకుండా రూం ఉన్న పేరుకు భిన్నంగా వ‌చ్చి అడిగితే రూం తాళం ఇచ్చేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌. అలాంటి లాజిక్కుల‌తో సంబంధం లేకుండా సోష‌ల్ మీడియాలో బ‌రాబ‌రా రాత‌లు రాసేస్తే.. దాన్ని చూసిన ఆమె అభిమానులు.. అయ్యో.. అయ్యో అంటూ గుండెలు బాదేసుకోవ‌టం.. అన‌వ‌స‌ర‌మైన లొల్లి త‌ప్పించి ఇంకేమైనా ఉందా? అన్న ప్ర‌శ్న వ్య‌క్త‌మ‌వుతోంది.