Begin typing your search above and press return to search.

టాప్‌ 10 బికినీ బాడీల్లో మన సోయగం

By:  Tupaki Desk   |   27 July 2015 4:38 AM GMT
టాప్‌ 10 బికినీ బాడీల్లో మన సోయగం
X
తెలుగమ్మాయిలు బికినీలు వేయరు. టూపీస్‌లు ధరించరు. క్లీవేజ్‌ షోలకు దూరం అని ఇంతకాలం అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడంతా సీను రివర్సులోకి వచ్చేస్తోంది. మారుతున్న ప్రపంచంతో పాటు తెలుగమ్మాయిలు కూడా మారుతున్నారు. స్పీడ్‌ని క్యాచ్‌ చేస్తున్నారు. ర్యాంపు షోలు, మోడలింగ్‌, యాంకరింగ్‌, నటన అన్ని రంగాల్లోనూ పైచేయి సాధించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. పరిధుల్లో ఉంటూనే అన్నిటినీ సాధించుకుంటున్నారు.

ఇదే విషయాన్ని ఓ తెలుగమ్మాయి కాసింత ప్రాక్టికల్‌గా నిరూపిస్తోంది. వైజాగ్‌ నుంచి ముంబై ర్యాంపు మీదికి వెళ్లి తానేంటో నిరూపించుకున్న శోభిత ధూళిపాళ 2013 మిస్‌ ఇండియా ఎర్త్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ అమ్మడి అందంతో పాటు తెలివితేటలు ఆకర్షించడం వల్ల ఆ కిరీటం తొడిగారు నిర్వాహకులు. అప్పట్నుంచి శోభిత క్షణం తీరిక లేకుండా ర్యాంప్‌ వాక్‌ లు, మోడలింగ్‌ అసైన్‌ మెంట్స్‌ చేస్తోంది.

లేటెస్టుగా ఈ అమ్మడు ఫ్యాషన్‌ సర్కిల్స్‌లో పెద్ద స్థాయిలో చర్చకొచ్చింది. ఇండియాలోనే టాప్‌ 10 బికినీల్లో ఈ అమ్మడి పేరును చేర్చారు. సెక్సీ బికినీ అంటూ కితాబిచ్చారు. దీంతో ప్రపంచం కళ్లన్నీ ఈ అమ్మడిపైనే ఇప్పుడు. శోభిత చాలా కాలంగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తెలుగమ్మాయి-బికినీ టూ ఇన్‌ వన్‌ కావాలనుకునే దర్శకులకు ఇదో సదవకాశమే!