Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బోటుపై స్లీపింగ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   7 Oct 2018 10:47 AM GMT
ఫోటో స్టొరీ: బోటుపై స్లీపింగ్ బ్యూటీ
X
గూఢచారి' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మళ్ళీ పెద్దగా తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినట్టులేదు తెనాలి బ్యూటీ శోభిత ధూళిపాళకు. అలా అని ఆమెకు ఆఫర్లు లేవనుకోవద్దు. హిందీ.. మలయాళంలో సినిమాలు చేస్తోంది. బ్రిటన్ లో తెరకెక్కే ఒక ఇంటర్నేషనల్ పీరియడ్ ఫిలిం లో కూడా అవకాశం వచ్చిందట. ఇవన్నీ సరే.. ఆమె అసలే మిస్ ఇండియా.. ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చింది కాబట్టి హాట్ ఫోటో షూట్స్ అనేవి చాలా కామన్.

రీసెంట్ గా శోభిత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. సముద్రంలో ఒక పెద్ద వైట్ కలర్ బోటు.. అందులో పింక్ బికినీలో అందాలను ధారపోస్తూ అలా విశ్రమించింది. సీగ్రీన్ కలర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్.. వైట్ కలర్ బోటు కు ఆమె గోధుమ రంగు మేని ఛాయకు పింక్ బికినీకి భలేగా లంకె కుదిరింది. ఫేస్ ను కెమెరా వైపుకు కాకుండా అవతలవైపుకు తిప్పుకుంది. దీంతో చచ్చినట్టు ఎవరైనా ఆమె అందాలను చూడాల్సిందే.

ఈ టూ పీస్ బికిని ఫోటోను ఈ ఏడాది జూలై 3 న తీసినట్టుగా చెప్పింది. డేటు ఏదైతేనేం శోభితా .. నెటిజనులకు కావలసింది హాటుగా ఘాటుగా బికిని వేసుకున్న ఫోటో అయినప్పుడు? అంతా బాగానే ఉంది కానీ ఎందుకో లైకులు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. జస్ట్ 8 వేలే. అంటే మన తెలుగు ఫిలిం మేకర్స్.. హీరోలకే కాదు నెటిజనులకు కూడా నార్త్ బికినీలే కావాలేమో..!!