Begin typing your search above and press return to search.

టీకొట్టు ద‌గ్గ‌ర నాటు తెలుగు పాప‌..!

By:  Tupaki Desk   |   14 Jan 2023 4:30 PM GMT
టీకొట్టు ద‌గ్గ‌ర నాటు తెలుగు పాప‌..!
X
నాటు నాటు.. గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని కొల్ల‌గొట్ట‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి దానిపైనే ఉంది. అంతేకాదు.. సోష‌ల్ మీడియాల్లో నాటుగా ఘాటుగా ఫోజులిచ్చే తెలుగ‌మ్మాయిల‌పైనా అంద‌రి క‌న్ను ఉంది.

ఇదిగో ఇక్క‌డ చూస్తున్నారు క‌దా.. తెలుగ‌మ్మాయి శోభితా ధూళిపాలా రాజస్థాన్ లో అలా షికార్ కి వెళ్లింది. అలా వెళ్లేప్పుడు స్ట్రీట్ ఫుడ్ ని ఆస్వాధించింది. ధూళిపాలా ప్రస్తుతం రాజస్థాన్‌- జోధ్‌పూర్ లో ఉంది. అక్క‌డ నగరంలోని ప్రతి బిట్ ను అన్వేషిస్తోంది.

ఈ అన్వేష‌ణ‌లో ఇదిగో ఇలా ఛాయ్ దుకాణం ద‌క్క‌ర టీ కొట్టేస్తూ క‌నిపించింది. ఉత్తరాదిన అస‌లే గడ్డకట్టే చలి నుంచి కాపాడుకోవాలంటే వేడి వేడిగా ఏదైనా గొంతులో ప‌డాలి. అందుకే జోధ్ పూర్ లో ఫేమ‌స్ అయిన‌ కడక్ ఛాయ్ తాగుతోంది. అక్క‌డే గరం సమోసాలు కూడా తిందిట‌. చ‌క్క‌ని చిరుతిళ్లు దొరికే ఈ నగరంతో ప్రేమలో పడిపోయింద‌ట పాపం!

ఇన్ స్టాగ్రామ్ లో ఇలా టీ కొడుతూ పోజులిచ్చిన ఫోటోను శోభిత‌ షేర్ చేసింది. క్యాప్షన్ లో 'తండ్ భీ లగీ హై ఔర్ చాయ్ భీ పీనా హై... తబియత్ భీ ఖరాబ్ హై ఔర్ సమోసా భీ ఖానా హై" అని వ్యాఖ్య‌ను జోడించింది.

శోభిత నిరంత‌ర అన్వేషి. ప్ర‌యాణాల‌ను అమితంగా ఇష్ట‌ప‌డుతుంది. త‌న ప్ర‌యాణాల్లో ర‌క‌ర‌కాల ప్రాంతాలు దేశాల గురించి వ‌ర్ణిస్తూ ట్రావెల్ డైరీని మెయింటెయిన్ చేస్తోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. శోభిత ఇటీవలే 'మేడ్ ఇన్ హెవెన్ 2' డబ్బింగ్ ప్రారంభించింది. శోభిత డబ్బింగ్ సెషన్ నుండి తన ఫోటోను పోస్ట్ చేసి "ఎం.ఐ.హెచ్ సీజన్ 2'లో నేను ఏ పిచ్చి సన్నివేశానికి డబ్బింగ్ చేబుతున్నానో మీరు గుర్తించలేకపోతున్నారనేది ఆలోచిస్తూ.."అనే ఆస‌క్తిక‌ర‌ క్యాప్షన్ ఇచ్చింది.

మేడ్ ఇన్ హెవెన్ అనేది ఢిల్లీలోని ఇద్దరు వెడ్డింగ్ ప్లానర్ ల కథ. సాంప్రదాయం వెన‌క ఆధునిక ఆకాంక్షలతో అతి భారీ భారతీయ వివాహాల నేపథ్యంలో అనేక రహస్యాలను వాటి వెన‌క క‌ఠోర‌మైన‌ అబద్ధాలను బహిర్గతం చేసే సిరీస్ ఇది. ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించిన ఈ సిరీస్ ను జోయా అక్తర్ మరియు- రీమా కగ్టి సంయుక్తంగా రూపొందించారు. అలంకృత శ్రీవాస్తవతో కలిసి క‌థ‌ల‌ను రాశారు. జోయా అక్తర్- శ్రీవాస్తవ- నిత్యా మెహ్రా- ప్రశాంత్ నాయర్ మొదటి సీజన్ లోని తొమ్మిది ఎపిసోడ్ లకు దర్శకులుగా పనిచేశారు.

ఈ షోలో అర్జున్ మాథుర్- కల్కి కోచ్లిన్- జిమ్ సర్భ్- శశాంక్ అరోరా -శివాని రఘువంశీ కూడా నటించారు. మేడ్ ఇన్ హెవెన్ 2తో పాటు శోబిత గూఢచారి థ్రిల్లర్ సిరీస్ ది నైట్ మేనేజర్ లో న‌టిస్తోంది. కొన్ని ఇంకా నిర్మాణ దశల్లో ఉన్న ప‌లు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. రోనీ స్క్రూవాలా - సితార ... దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తూ నటించిన హాలీవుడ్ ప్రాజెక్ట్ మంకీ మ్యాన్ లోను శోభిత ధూళిపాళ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అడివి శేష్ గూఢ‌చారి త‌ర్వాత సీక్వెల్ ప్ర‌ణాళిక‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే పార్ట్ 1 లో శోభిత పాత్ర హ‌త్య‌కు గుర‌వుతుంది. అందువ‌ల్ల సీక్వెల్లో న‌టించేందుకు ఆస్కారం ఉండ‌ద‌ని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.