Begin typing your search above and press return to search.

అద‌ర‌తాంబూలం పార్ట్ 3?

By:  Tupaki Desk   |   31 July 2018 5:38 PM GMT
అద‌ర‌తాంబూలం పార్ట్ 3?
X
మొన్న‌నే ఆర్‌.ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ పెద‌వి ముద్దుల‌తో దుమ్ము దుమారం అంటే ఏంటో చూపించింది. అర‌టి తోట‌లో - జొన్న చేలో ప్రియుడి చొక్కా బ‌ట‌న్స్ విప్పి నాటు స‌ర‌సంతో రెచ్చ‌గొట్టింది. బోయ్స్ ఆ ఒక్క యాంగిల్ కోస‌మే ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు వెళ్లారు. అలా ఆర్‌.ఎక్స్ 100 బంప‌ర్ హిట్ కొట్టడంలో పాయ‌ల్ భాగ‌స్వామి అయ్యింది. అమ్మ‌డిలో గ్రేసు - ఈజు చూసి వెంట‌నే తేజ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు.

దాంతో పెద‌వి ముద్దుల ఎపిసోడ్ ముగిసిపోయిన‌ట్టే అనుకున్న వాళ్లకు అంత‌కుమించిన స‌ర్‌ ప్రైజ్‌ లు మునుముందు బోలెడ‌న్ని ఉంటాయ‌ని మొన్న‌టికి మొన్న `ఈ మాయ పేరేమిటో` ఫేం కావ్య థాప‌ర్ ప్రూవ్ చేసింది. ట్రైల‌ర్‌ లోనే ఈ అమ్మ‌డు హీరోని ఘాడ చుంభ‌నాల్లో ముంచెత్తింది. ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా తెగ రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే రాముల‌మ్మ‌లా తిత్తి తీసింది. ఆ ఇద్ద‌రూ స‌రేలే అనుకుంటుండగానే అంత‌కుమించి వేరొక పెను ఉప్పెన ముంచుకు రాబోతోంది. పెద‌వి ముద్దుల‌కు పేటెంట్ ఉండ‌ద‌ని నిరూపిస్తూ.. ఇదిగో ఈ కొత్త‌మ్మాయ్‌.. పైగా తెలుగమ్మాయ్ ర‌చ్చ చేస్తోంది. అద‌ర‌తాంబూలం పార్ట్ 3లాగా గూఢ‌చారి ఫేం - తెనాలి బేబీ శోభిత‌ ధూళిపాల సుదీర్ఘ అద‌ర‌చుంబ‌నాలతో రెచ్చిపోనుందిట‌. తాజాగా సెన్సార్ బృందం ఈ సినిమా వీక్షించి గుడ్లు తేలేసింద‌ని తెలుస్తోంది. యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చి అటుపై సుదీర్ఘ‌మైన చుంబ‌నాల గురించే సెన్సార్ వాళ్లు పదే ప‌దే బ‌య‌టికొచ్చి గొణుక్కున్నార‌ట‌. అయితే కాన్సెప్టులో భాగం ఆ పెద‌వి ముద్దులు అని స‌రిపుచ్చుకుని సీబీఎఫ్‌సీ సైతం అభ్యంత‌రం చెప్ప‌లేద‌ట‌. థ్యాంక్స్ టు శోభిత ధూళిపాల & అడివి శేష్‌!!