Begin typing your search above and press return to search.

ఆ ఫ్యాషన్ డిజైనర్ ప్రేమలో తెలుగు బ్యూటీ

By:  Tupaki Desk   |   10 April 2019 9:04 AM GMT
ఆ ఫ్యాషన్ డిజైనర్ ప్రేమలో తెలుగు బ్యూటీ
X
మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని తెలుగు బ్యూటీలు ఎవరికీ తీసిపోరు అని నిరూపించింది శోభిత ధూళిపాళ. బాలీవుడ్ సినిమాలలో నటించిన శోభిత 'గూఢచారి' తో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. సినిమాలే కాకుండా వెబ్ సీరీస్ లో నటిస్తూ న్యూ జనరేషన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా 'మేడ్ ఇన్ హెవెన్' వెబ్ సీరిస్ లో ఘాటుగా నటించి అందరి మతులు పోగొట్టింది.

ఇదంతా ప్రొఫెషన్. పర్సనల్ లైఫ్ లో ఈ భామ లవ్ లో పడిందని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రణవ్ మిశ్రాను కొంతకాలం క్రితం ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో కలిసిందట. ఇద్దరి అభిరుచులు నచ్చడంతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టారట. ఇద్దరూ కలిసి ట్రిప్పులకు కూడా వెళ్తున్నారట. ఈ జంట జోరు చూస్తుంటే బాలీవుడ్ లో మరో సెలబ్రిటీ లవ్ స్టొరీ మొదలైనట్టేనని అంటున్నారు. మరి ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ అని తేల్చేస్తుందా... లేదా డేటింగ్ చేస్తున్నామని బోల్డ్ గా ఒప్పుకుంటుందా అనేది వేచి చూడాలి.

శోభిత ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'మూతోన్' అనే మలయాళం హిందీ ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా సేక్రేడ్ గేమ్స్ సీజన్ 2 వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది.