Begin typing your search above and press return to search.

తెనాల‌మ్మాయికి బంప‌రాఫర్

By:  Tupaki Desk   |   15 Feb 2022 4:42 AM GMT
తెనాల‌మ్మాయికి బంప‌రాఫర్
X
ఇటీవ‌ల పాన్ ఇండియా సీజ‌న్ న‌డుస్తోంది. అంత‌కంత‌కు భారీ సినిమాలు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ - వ‌లీమై- బీస్ట్ స‌హా ప‌లు భారీ పాన్ ఇండియా చిత్రాలు విడుద‌ల ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నాయి.

తాజాగా ఈ రేస్ లోకి మ‌రో త‌మిళ‌ పాన్ ఇండియా మూవీ చేరింది. ఆర్ మాధవన్ న‌టిస్తున్న `రాకెట్రీ- ది నంబి ఎఫెక్ట్` 1 జూలై 2022న ఆరు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. దాదాపు ఏడాది క్రితం R మాధవన్ తన త‌దుప‌రి చిత్రం రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. అయితే మహమ్మారి రెండవ వేవ్ కారణంగా సినిమా విడుదల ప‌లుమార్లు వాయిదా ప‌డింది.

అడివి శేష్ `గూఢ‌చారి` చిత్రంలో అద్భుత‌మైన అతిథి పాత్ర‌తో మెప్పించింది శోభిత ధూళిపాల. క‌నిపించింది త‌క్కువ స‌మ‌య‌మే అయినా కానీ త‌న‌దైన న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది. ఆ త‌ర్వాత మేజ‌ర్ లోనూ అవ‌కాశం క‌ల్పించాడు శేష్. శోభిత ఇటీవ‌ల బాలీవుడ్ లో వ‌రుస ఆఫర్ల‌తో దూసుకుపోతోంది.

తాజా స‌మాచారం మేర‌కు.. తెనాల‌మ్మాయి ఖాతాలో మ‌రో అద్భుత‌మైన ఆఫ‌ర్ ప‌డింది. బాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న `ది నైట్ మేనేజర్‌`లో ఆదిత్య రాయ్ కపూర్ - అనిల్ కపూర్ లతో కలిసి శోభిత కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

రీమేక్ లో ఎలిజబెత్ డెబిక్కీ పాత్రను తిరిగి పోషించనుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్ ఒరిజినల్ నుండి టామ్ హిడిల్ స్టన్ పాత్ర‌లోకి అడుగుపెట్టనున్నాడు. నైట్ మేనేజర్ రీమేక్ ఇటీవల శ్రీలంకలో ప్రారంభమైంది. తాజా క‌థ‌నం ప్రకారం.. శోభితా ధూళిపాళ ది నైట్ మేనేజర్ క‌థానాయిక‌గా ఫిక్స‌య్యింది.

ఎలిజబెత్ డెబిక్కీ పాత్ర కోసం ఇటీవ‌ల కొంత‌కాలంగా మేకర్స్ వెతుకుతున్నారు. ఇప్పుడు శోభిత ను ఈ పాత్ర కోసం లాక్ చేసారు. నిజానికి హృతిక్ రోషన్ న‌టిస్తాడ‌ని భావించిన స‌మ‌యంలో కూడా శోభిత తో చిత్ర‌బృందంతో చ‌ర్చ‌లు జరిపింది. కానీ ఆ త‌ర్వాత హృతిక్ కొన్ని కార‌ణాల వ‌ల్ల త‌ప్పుకున్నారు. అదే పాత్ర కోసం ఆదిత్య రాయ్ కపూర్ ని ఎంపిక చేశారు. ఈ సిరీస్ లో ఆఫ‌ర్ రాగానే శోభిత సంతోషాన్ని వ్య‌క్తం చేసింద‌ని తెలిసింది. న‌టిగా త‌న‌కు నిరూపించుకునే మ‌రో బంప‌రాఫ‌ర్ ఇద‌ని తెలిసింది.