Begin typing your search above and press return to search.

సామాజిక కార్య‌క‌ర్త‌ షాకింగ్ ఆరోప‌ణ‌లు..!

By:  Tupaki Desk   |   15 April 2018 5:23 AM GMT
సామాజిక కార్య‌క‌ర్త‌ షాకింగ్ ఆరోప‌ణ‌లు..!
X
టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం. ఇదేమీ కొత్త అంశం కాన‌ప్ప‌టికీ.. గ‌తానికి భిన్నంగా ఈ అంశంపై టీవీల్లో ఓపెన్ గా మాట్లాడేందుకు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు న‌టీమ‌ణులు బ‌య‌ట‌కు వచ్చి ఓపెన్ కావ‌టం ఒక‌టైతే.. త‌మ‌కూ ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయంటూ టీవీల ముందుకు వ‌చ్చేస్తున్నారు.

క్యాస్టింగ్ కౌచ్ మీద త‌న గ‌ళాన్ని విప్పిన సినీ న‌టి శ్రీ‌రెడ్డి పుణ్య‌మా అని ఈ ఇష్యూ అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా జ‌రిగిన టీవీ చ‌ర్చ‌లో షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు సామాజిక కార్య‌క‌ర్త సంధ్య‌.

సినీ న‌టీమ‌ణులు మాధ‌వీల‌త‌.. గాయ‌త్రి గుప్తాల‌తో నిర్వ‌హించిన టీవీ ఛాన‌ల్ చ‌ర్చ‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి హాట్ హాట్ గా చ‌ర్చ జ‌రిగింది. క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఉదంతాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ త్వ‌ర‌లో ఒక క్వాష్ క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇలాంటి క‌మిటీలో క్యాస్టింగ్ కౌచ్ లేద‌నే న‌టీమ‌ణుల్ని నియ‌మిస్తే ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌న్న మాట చ‌ర్చ‌లో వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో సామాజిక కార్య‌క‌ర్త సంధ్య‌ను ఫోన్ ఇన్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్వాష్ క‌మిటీలో నియ‌మించే మ‌హిళ‌లకు సంబంధించి కొన్ని సూచ‌న‌లు చేశారు. ఇదిలా ఉంటే.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ అన్న‌ది లేదంటూ సినీ న‌టి జీవిత చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఆమె త‌ప్పు ప‌ట్టారు.

జీవిత రాజ‌శేఖ‌ర్ విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో చిత్ర ప‌రిశ్ర‌మ త‌న‌నో దేవ‌త‌లా ట్రీట్ చేసింద‌ని చెప్పుకున్నార‌ని.. ఇదంతా ప‌చ్చి అబ‌ద్ధమ‌న్నారు. త‌మ దృష్టికి వ‌చ్చిన కొన్ని ఉదంతాల్ని ప్ర‌స్తావించారు. అమీర్ పేట‌లోని ఒక హాస్ట‌ల్ లో ఉండే ఒక అమ్మాయి తీవ్ర‌మైన జ్వ‌రంతో ప‌డి ఉన్న స‌మ‌యంలో ఒక ఫోన్ వ‌చ్చింద‌ని.. ఆ కాల్ ను ఆమె స్నేహితురాలు ఫోన్ ఎత్తిన‌ట్లుగా చెప్పారు.

ఫోన్ కాల్ స్టార్ట్ కావ‌టంతోనే ల‌కారంతో మొద‌లైందని.. బండ బూతులు తిట్టింద‌ని.. నువ్వు ఇవాళ ఎందుకు రాలేదు? నువ్వు రావాల్సిన రోజు ఇదే క‌దా? నా భ‌ర్త పెట్టే బాధ‌లు ఎవ‌డు ప‌డాలే.. వాడు పెట్టే వేధింపులు ఎవ‌రు తినాలే? అంటూ మాట్లాడిన వైనాన్ని ఆమె స్నేహితురాలు విని త‌మ దృష్టికి తెచ్చింద‌న్నారు. ప‌ల్లె నేప‌థ్యం నుంచి వ‌చ్చిన అమ్మాయి హాస్ట‌ల్ లో ఉంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాన‌ని చెప్పేద‌ని.. మొద‌ట్లో వ‌చ్చిన దాని కంటే కాస్త స్టైల్ గా ఉండేద‌ని.. ఆ ఫోన్ కాల్ త‌ర్వాత ఆమెను నిల‌దీస్తే తాను చేసే ప‌ని గురించి చెప్పింద‌న్నారు. భ‌ర్త కోసం అమ్మాయిల్ని జీవితే పంపేద‌న్న విష‌యం ఈ మ‌ధ్య‌నే ఇద్ద‌రు అమ్మాయిలు బ‌య‌టపెట్టార‌న్నారు. తాను ట్రైన్లో వెళుతున్న స‌మ‌యంలో ఒక అమ్మాయి ప‌రిచ‌య‌మై.. త‌మ‌ను జీవిత రాజ‌శేఖ‌ర్ దంప‌తులు ఎంత‌లా ఇబ్బందిపెట్టారో చెప్పార‌న్నారు.

ఇదంతా తానిప్పుడు చెప్ప‌టానికి కార‌ణం.. ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ అన్న‌ది లేదంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌టం వ‌ల్ల‌నేన‌ని సంధ్య స్ప‌ష్టం చేశారు. త‌మ‌ను తాము ఆద‌ర్శ దంప‌తులుగా చెప్పుకునే జీవిత రాజ‌శేఖ‌ర్ లాంటోళ్ల భాగోతాలు చాలానే ఉన్నాయంటూ మండిప‌డ్డారు. సామాజిక కార్య‌క‌ర్త సంధ్య చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి