Begin typing your search above and press return to search.
సుశాంత్ సింగ్ మరణం వెనుక యువ మంత్రి హస్తం ఉందా?
By: Tupaki Desk | 7 Sep 2020 12:30 PM GMTముంబైలో బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పదంగా మృతి చెంది రెండు నెలలు కావస్తుంది. అయినా ఈ కేసులో ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. సుశాంత్ మరణం తర్వాత ఆ ఇంట్లో ఆధారాలు అన్ని చెరిపేశారని అంటున్నారు. కనీసం పోస్టు మార్టం లో కూడా ఏం తేలకపోవడంతో ఈ కేసులో మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ వైపే అందరి వేళ్లు కనిపిస్తున్నాయి.. ఎందుకిలా చేస్తోంది. ? దీనివెనుక ఎవరున్నారు? ఏంటా కథ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దేశంలో ఉన్న జాతీయ చానెల్స్ అన్నీ ఇప్పుడు సుశాంత్ మరణం గురించే తీవ్ర పరిశోధన చేస్తున్నాయి. ఇది హత్య లేదా ఆత్మహత్య అన్న కోణంలో కథనాలు వండి వారుస్తున్నాయి. పరిశోధన చేస్తున్నాయి. సుశాంత్ చుట్టే ఇప్పుడు జాతీయ మీడియా తిరుగుతోంది.
కొన్ని చానెల్స్ అదే పనిగా సుశాంత్ సింగ్ టాపిక్ తీసుకొని చర్చలు పెడుతున్నాయి. అయితే కొత్తగా సోషల్ మీడియాలో చర్చల వెనుక మహారాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక యువ మంత్రి హస్తం ఉందని కూడా ముంబైలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆ యువ మంత్రికి బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయని అంటున్నారు.
సుశాంత్ సింగ్ మేనేజర్ భవనంపై నుంచి దూకిన కేసులో కూడా ఆ యువ మంత్రి హస్తం ఉందని కూడా చర్చ జరుగుతోంది. అది సూసైడ్ కాదు.. రేప్ చేసి తోసేశారని కూడా కొందరు అంటున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కానీ.. శివసేన పార్టీ కానీ ఈ సుశాంత్ కేసు విషయంలో ఎందుకు ఇంతగా కంగారు పడుతోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అని అంటున్నారు. శివసేన పార్టీ ఎందుకు ఈ కేసును తొక్కి పెట్టేయాలని చూస్తోందని అంటున్నారు. దీని వెనుక ఒక యువ మంత్రి ఉన్నాడని.. అందుకే ప్రభుత్వం దీనిమీద ఎన్ని సార్లు తెరపైకి వచ్చినా తొక్కి పెట్టేస్తోందని కూడా అంటున్నారు. ఏదిఏమైనా ఈ సస్పెన్స్ త్వరగా తేలితే అందరూ ఊపిరి పీల్చుకుంటారు.