Begin typing your search above and press return to search.

త్రిష.. తప్పా? తప్పున్నరా?

By:  Tupaki Desk   |   17 March 2016 4:20 AM GMT
త్రిష.. తప్పా? తప్పున్నరా?
X
ఉత్తరాఖండ్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యే పోలీస్ గుర్రాన్ని కొట్టడంతో.. అది గాయపడ్డ సంఘటనపై పాపం దేశంలో చాలా మంది 'జంతు' ప్రేమికులు తెగ బాధ పడుతున్నారు. ఈ లిస్ట్ లో చెన్నై బ్యూటీ త్రిష కూడా ఉంది. 'నువ్వు నరకానికి పోవాలని కోరుకుంటా, ఈ సంఘటనపై సిగ్గు పడుతున్నా'నంటూ ట్విట్టర్ ద్వారా ఘాటుగానే స్పందించింది. దీనికి నెటిజన్లలో ఎక్కువమంది నుంచి మద్దతు కూడా వచ్చింది. కానీ కొంతమంది మాత్రం త్రిషపైనే రివర్స్ అవుతున్నారు.

'దేశంలో మనుషులను చంపేస్తున్న సంఘటనలు జరిగినపుడు ఎప్పుడూ సిగ్గుగా అనిపించలేదా? లేదా అప్పుడు మాట్లాడ్డానికి భయపడ్డావా?' అంటూ ప్రశ్నించాడు ఓ వ్యక్తి. అలాగే 'ఎవరో గుర్రాన్ని కొడితే దానిపై ట్వీట్ చేస్తారు. కుల రాజకీయాలతో వ్యక్తిని ముక్కలుగా నరికినపుడు ఏమనిపించలేదా?' అంటూ మరో వ్యక్తి నిలదీశాడు. ఆ వీడియో మార్ఫింగ్ చేసిందనే పాయింట్ ని కూడా ప్రస్తావించి, ఓ సెలబ్రిటీగా నిజానిజాలు తెలుసుకోవాలని సూచించాడు మరో వ్యక్తి.

ఓ మూగ జంతువుకు ఏదో జరిగిందని త్రిష బాధపడ్డం కరెక్టే అనుకున్నా.. అదే రోజున.. హర్యానాలో సుఖ్వీందర్ నర్వాల్ అనే జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్ ని నడి రోడ్డుపై తుపాకులతో కాల్చి చంపేశారు. ఇద్దరు వ్యక్తులు నేరుగా తలలోకే బుల్లెట్లు దించడంతో.. అతను చనిపోయాడు. మరి త్రిషకి ఈ సంఘటన దారుణంగా అనిపించలేదా? అంతేలే.. జంతువులపై ప్రేమ చూపిస్తే ప్రచారం వస్తుంది కానీ.. మనుషుల గురించి మాట్లాడితే కులాలు, మతాలు అంటూ మళ్లీ గొడవలొస్తాయి కదా!