Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
By: Tupaki Desk | 27 Jun 2022 9:30 AM GMTసోషల్ మీడియాలో ఈ మధ్య స్టార్స్ ట్రోల్స్ కి గురవుతున్నారు. ఏ చిన్న విషయంపై ట్వీట్ చేసినా.. మరొకరు చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేసిన యాంటీ ఫ్యాన్స్ వెంటనే యాక్టీవ్ అయిపోతున్నారు.. రంగంలోకి దిగేసి ఇష్టాను సారం స్టార్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల నాగచైతన్య బాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాలతో డేటింగ్ లో వున్నాడంటూ పుట్టికొచ్చాయి. అయితే ఈ వార్తలని సమంత పీఆర్ టీమే సృష్టించిందని, కావాలనే మా హీరోని అన్ పాపులర్ చేయాలని చూస్తున్నారంటూ చై ఫ్యాన్స్, నెటిజన్ లు సామ్ పై మండి పడ్డారు.
దీంతో అసహనానికి గురైన సమంత ఎదగండి బాయ్స్ ఎదగండి అంటూ క్లాస్ పీకింది. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలు ఎదుగుతున్నారని, కానీ అబ్బాయిలు మాత్రం ఇంకా ఎదగడం లేదంటూ తనపై కామెంట్ లు చేసిన వారికి చురకలు అంటించింది. ఇక ఈ వివాదం సమసిపోయింది అనుకుంటే రీసెంట్ గా హీరో మాధవన్ ట్రోలర్స్ కి అడ్డంగా బుక్కవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. మాధవన్ నటిస్తూ రూపొందించిన `రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్` జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. చురుగ్గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మాధవన్ ఇటీవల ఓ మీడియా మీట్ లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి. `అంతరిక్షంలోకి రాకెట్ ను ప్రయోగించినప్పుడు అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రో కు పంచాంగం ఉపయోగపడుతుందని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఇస్రో వాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయి` అని మాధవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వీడియో పై నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతోంది. మాధవన్ ఇలా ఎలా మాట్లాడతారని ఏకి పారేస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా కొంత మంది యాంటీ ఫ్యాన్స్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పై విమర్శలు చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణల కేంద్రం టీ హడ్ రెండవ దశ లో భాగంగా గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గంలో టీ హబ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణాన్ని జూన్ 28న ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం టీ హబ్ రెండవ దశకు సంబంధించిన ఫొటోలని షేర్ చేస్తూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
దీనిపై గత రెండు రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీలో స్పందిస్తూ కేజీఆర్ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తున్నారు. ఆదివారం సమంత ట్వీట్ చేస్తూ గర్వంగా వుందని వెల్లడించింది. అంతే కాకుండా కేటీఆర్ ట్వీట్ ని రీ ట్వీట్ చేసింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కేటీఆర్ ట్వీట్ పై స్పందించారు. హైదరాబాద్ ఈకో సిస్టమ్ కు మాసీవ్ స్టెప్ పడిందని, కేటీఆర్ గారు గర్వంగా వుంది, టీ హబ్ ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో మీకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మహేష్.
దీనిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన యాంటీ ఫ్యాన్స్ మహేష్ ని ట్రోల్ చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా వుండాలని ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తుంటే యాంటీ ఫ్యాన్స్ ఓరేంజ్ లో రెచ్చిపోతూ మీకీ ధైర్యం ఏంటీ?... ఎందుకు స్పందిస్తున్నారు.. పొలిటికల్ ట్వీట్ లకు దూరంగా వుండండి.. అంటూ నానా రకాలుగా కామెంట్ లు చేస్తున్నారు.