Begin typing your search above and press return to search.

ఆ హీరోని మామూలుగా ఆడుకోవ‌డం లేదు!

By:  Tupaki Desk   |   2 Dec 2022 12:01 PM GMT
ఆ హీరోని మామూలుగా ఆడుకోవ‌డం లేదు!
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన 'కేజీఎఫ్‌' ఏ క్ష‌ణాన పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుని కాసులు వ‌ర్షం కురిపించిందో కానీ క‌న్న‌డ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ఈ సినిమా స‌రికొత్త జోష్ ని, అంతులేని ఆత్మ విశ్వాసాన్ని అందించింది. ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ భారీ క్రేజీ సినిమాల నిర్మాణం ఊపందుకుంది. 'కేజీఎఫ్ 2' సంచ‌ల‌న విజ‌యం త‌రువాత క‌న్న‌డ మేక‌ర్స్ లో మ‌రింత న‌మ్మ‌కం, జోర్ పెరిగాయి. దీంతో అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం మొద‌లు పెట్టారు.

రాఖీ నుంచి 'పుష్ప‌'లో వ‌న్ ఆఫ్ ది విల‌న్ ల‌లో ఒక‌డిగా న‌టించిన డాలీ ధ‌నుంజ‌య వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క హీరో పాన్ ఇండియా జ‌పం చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇప్ప‌టిరే క‌న్న‌డంలో ఐదారు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే.

రీసెంట్ గా 'కాంతార‌' కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో మ‌రింత మంది స్టార్స్ పాన్ ఇండియా సినిమాల‌తో బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. ఇదే ఊపులో క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ తో క‌లిసి న‌టించిన మూవీ 'క‌బ్జ‌'.

చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ అలంకార్ పాండ్య‌న్ తో క‌లిసి ఈ భారీ పీరియాడిక్‌ పాన్ ఇండియా మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించాడు. రీసెంట్ గా ఈ మూవీ తెలుగు టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. కేజీఎఫ్ కోలార్ మైన్స్ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించిన ఈ మూవీ టీజ‌ర్ ని చూసిన వాళ్లంతా రాఖీ భాయ్ అడ్డాలో క‌బ్జా అంటూ కామెంట్ లు చేశారు. మ‌రి కొంత మంది కేజీఎఫ్ కు కంటినేష‌న్ లా వుందే అని కూడా అన్నారు. ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయ‌బోతున్నారు.

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌లలోనూ రిలీజ్ కానున్న నేప‌థ్యంలో తాజాగా గురువారం ఈ మూవీ హిందీ టీజ‌ర్ ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 'కేజీఎఫ్‌' సిరీస్ సినిమాల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన ఉత్త‌రాది ప్రేక్ష‌కులు 'క‌బ్జ‌'ని, ఇందులో న‌టించిన హీరో ఉపేంద్ర‌ని మాత్రం సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకోవ‌డం మొద‌లు పెట్టారు. మ‌ళ్లీ 'కేజీఎఫ్‌' టీజ‌ర్ ని రిలీజ్ చేశార‌ని కొంత మంది ట్రోల్ చేస్తుంటే మ‌రి కొంత మంది రాఖీ భాయ్ లేకుండా 'కేజీఎఫ్ 3'ని తీశారా ఏంటీ? అని కామెంట్ లు చేస్తున్నారు.

అంతే కాకుండా 'కేజీఎఫ్‌'లోని కొన్ని సీన్ ల‌ని లేపేసి ఈ సినిమా తీసిన‌ట్టుగా వుంద‌ని, తీసిన సినిమానే ఎన్నిసార్లు తీస్తార‌ని ఆడుకోవ‌డం మొద‌లు పెట్టారు. 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీని హిందీలో అనంద్ పండిట్ మోష‌న్ పిక్చ‌ర్స్ వారు రిలీజ్ చేయ‌బోతున్నారు. 1960 - 1984 మ‌ధ్య కాలంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల స‌మాహారంగా రూపొందిన ఈ మూవీలో శ్రియ‌, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, స‌ముద్ర‌ఖ‌ని, మ‌నోజ్ బాజ్ పాయ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.