Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ టికెట్ల రేట్ల పెంపుపై సోషల్ మీడియా ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   20 March 2022 1:30 PM GMT
ఆర్ఆర్ఆర్ టికెట్ల రేట్ల పెంపుపై సోషల్ మీడియా ట్రోల్స్‌
X
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ఈనెల 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిన పాన్ ఇండియా మూవీ. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్దం అయ్యింది. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాకు ఇచ్చిన టికెట్ల రేట్ల పెంపు అనుమతి విమర్శలకు తావిస్తుంది.

ఇటీవలే ఏపీలో టికెట్ల రేట్లను భారీగా పెంచుతూ కొత్త జీవో వచ్చింది. అంతకు ముందు తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు విషయమై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సినిమాలను చూడాలంటే టికెట్ల రేట్లకు భయపడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆర్ ఆర్‌ ఆర్‌ టికెట్ల రేట్లు మరింతగా పెరగడం తో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న భారీ టికెట్ల రేట్లను మరింతగా పెంచడం ఏమాత్రం బాగా లేదంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న టికెట్ల రేట్లకు వంద రూపాయలు అదనంగా వసూళ్లు చేయబోతున్నారు. తద్వారా ప్రేక్షకులపై భారీగా భారం పడే అవకాశాలు ఉన్నాయి. బెనిఫిట్ షో లకు సంబంధించిన టికెట్ల రేట్లను దాదాపుగా అయిదే వేల రూపాయలుగా నిర్ణయించారు అనే సమాచారం అందుతోంది. ఇక సాదారణ షో లకు టికెట్ల రేట్లు భారీగా ఉండబోతున్నాయి. ఈ టికెట్ల రేట్ల విషయంలో సాదారణ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మొదటి రెండు వారాల పాటు ఈ స్థాయిలో టికెట్ల రేట్లు పెట్టడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కు వెళ్లక పోవడం మంచిది అనే నిర్ణయానికి వస్తారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సినిమా అవ్వడం వల్ల ఈ సినిమా కు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చాం అంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు ప్రభుత్వాలు సినిమా టికెట్ల రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ ప్రతి ఒక్కరు అంటున్నారు.

రాబోయే రోజుల్లో విడుదల కాబోతున్న ఇంటర్నేషనల్‌ మూవీస్ బ్రహ్మాస్త్ర మరియు హాలీవుడ్‌ సినిమాలకు చెందిన నిర్మాతలు కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి కోరితే ఇస్తారా అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

పెద్ద బడ్జెట్‌ సినిమాలు అంటూ చెప్తే టికెట్ల రేట్లను పెంచేందుకు సిద్దం అవుతున్న ప్రభుత్వాల తీరు ఎప్పటికి మారుతుంది అంటూ సాదారణ సినీ ప్రేమికులు ఆవేదనతో సోషల్‌ మీడియాలో తమ గోడు వెళ్లబోస్తున్నారు. టికెట్ల రేట్లు ఈ స్థాయిలో ఉంటే ఓటీటీ స్ట్రీమింగ్‌ వరకు వెయిట్‌ చేస్తామంటూ కొందరు చిత్ర యూనిట్‌ సభ్యులకు కౌంటర్‌ ఇస్తున్నారు.