Begin typing your search above and press return to search.
కరోనాలో గాలికి వదిలేసిన వసలదారులపై సినిమానా?
By: Tupaki Desk | 18 Sep 2021 11:30 PM GMTకింగ్ ఖాన్ షారూక్ ప్రస్తుతం యష్ రాజ్ ఫిలింస్ లో పఠాన్ అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షారూక్ ఇందులో డాన్ తరహా గెటప్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సినిమాతో పాటు అతడు సౌత్ డైరెక్టర్ అట్లీ కుమార్ తదుపరి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే పూణే మెట్రోలో చిత్రీకరణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అట్లీ హిందీలో అరంగేట్రం చేస్తున్నందున ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తొలిసారి షారూక్ మూవీ హిందీతో పాటు తెలుగు- తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
అట్లీ తర్వాతా మరో డైరెక్టర్ ని షారూక్ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. సంచలనాల రాజ్ కుమార్ హిరాణీ ఇప్పటికే షారూక్ కి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవుతోంది. అయితే పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించిన రాజ్ కుమార్ హిరాణీ ఈసారి షారూక్ కోసం ఎలాంటి కథాంశాన్ని ఎంచుకున్నారు? అని ప్రశ్నిస్తే.. అతడు ఓ సామాజిక ఇతివృత్తాన్ని ఎంచుకుని తనదైన శైలి కామెడీని సెటైర్ ని ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. కనికా ధిల్లాన్‌తో కలిసి అతడు ఈ స్క్రిప్టుని రాశారు. ఈ చిత్రం సామాజిక కాన్సెప్ట్ `డాంకీ ఫ్లైట్` ఆధారంగా రూపొందిస్తున్నారు. పంజాబీ ఇడియమ్ ఈ పదం.. దీని అర్థం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి దూకడం అని అర్థం. సాధారణంగా చెప్పాలంటే ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళుతూ జీవించడాన్ని సూచిస్తుంది. ఈ సినిమాలో తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తోంది. స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ రెడీ అవుతోంది.
పంజాబ్ నేపథ్యంతో సినిమా కథాంశం సాగుతుంది. ఇప్పటికే పంజాబ్ లో లొకేషన్ ల వేటను ప్రారంభించారని తెలిసింది. త్వరలో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. 2022 మేలో సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ ని డిజైన్ చేస్తున్నారట. PK తర్వాత మళ్లీ సామాజిక వ్యంగ్యాస్త్రం సంధిస్తారా? కరోనా క్రైసిస్ నేపథ్యానికి వలసదారులను గాలికి వదిలేసిన కేంద్రప్రభుత్వ అనైతికతకు ముడిపెడుతూ ఏదైనా వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తున్నారా? అంటూ రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమాజాన్ని ఇతరులు చూసే తీరు వేరు... శంకర్.. హిరాణీ లాంటి ప్రముఖ దర్శకులు చూసే తీరు వేరు. అందుకే ఇది కూడా పీకే తరవాత హిరాణీ మళ్లీ అలాంటి సంచలనాలకు ప్రయత్నిస్తున్నారనే అభిమానులు భావిస్తున్నారు. నిజానికి ఇది వ్యంగ్యాస్త్రం పీకేకి సీక్వెల్ తరహానా? అన్నదానికి క్లారిటీ రావాల్సి ఉంటుంది. పీకే సీక్వెల్ ని అమీర్ తో కాకుండా రణబీర్ తో తెరకెక్కిస్తారని అంతకుముందు కథనాలొచ్చినా దానిని పక్కన పెట్టేసి షారూక్ తో హిరాణీ ముందుకెళుతుండడం ఆశ్చర్యపరుస్తోంది.
హిరాణీ మరిన్ని ప్రయోగాలకు సిద్ధం
హిరాణీ అంటేనే ప్రయోగాలు. అతడు గతంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో సంచలనాలు సృష్టించారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన పీకే 2014లో రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేవుళ్లపై వివాదాస్పద అంశం కావడంతో అప్పట్లో అది కూడా ప్రచారానికి కలిసొచ్చి మరింత పెద్ద హిట్టయ్యింది ఈ చిత్రం. సెటైరికల్ కామెడీగా ఈ మూవీని రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు కురిసాయి. క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకులు అంతే గొప్పగా ప్రశంసించారు.
ప్రముఖ నిర్మాత విదు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆ తర్వాత పీకేకు సీక్వెల్ తెరకెక్కనుందని ప్రచారమైనా ఇన్నాళ్లు కుదరలేదు. సరైన సమయం కోసం వేచి చూసిన దర్శకనిర్మాతల బృందం ఇప్పటికి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రయత్నించినట్టు కథనాలొచ్చాయి. పీకే ని ఎక్కడ ఎండ్ చేశారో అక్కడి నుంచి సీక్వెల్ కథ మొదలవుతుందట. అందులో క్లైమాక్స్ సన్నివేశంలో రణబీర్ కపూర్ పరిచయంతో కథ ముగుస్తుంది. దీంతో సీక్వెల్లో రణబీర్ నటిస్తాడని ఊహించారు. ఓ సమావేశంలో విధు వినోద్ మాట్లాడుతూ.. సీక్వెల్ చేస్తున్నాం. సినిమా చివరలో రణబీర్ ను చూపించాం. కాబట్టి చెప్పడానికి ఇంకా కథ ఉంది. కానీ అభిజీత్ (జోషి) ఇంకా సీక్వెల్ కథను రాయలేదు. అతను ఆ కథను రాసిన రోజున మేం తెరకెక్కిస్తాం`` అని అన్నారు.
2014 లో విడుదలైన పీకే అప్పటికి ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. సంజయ్ దత్- అనుష్క శర్మ- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తదితరులు నటించిన ఈ చిత్రంలో అమీర్ అంతరిక్షం నుంచి భూమిపైకి దిగే విదేశీయుడిగా కనిపిస్తారు. అతని అంతరిక్ష నౌకతో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడే పరికరం మిస్సవుతుంది. దానిని వెతుక్కుంటూ మానవ లోక సంచారం చేసేవాడిగా అంతరిక్షవాసి అమీర్ కనిపిస్తాడు.
ఈ చిత్రం సనాతన భారతీయ సమాజం .. మత విశ్వాసాల గురించి వ్యంగ్య దృక్పథంతో కనిపిస్తుంది. భోజ్ పురి యాసలో అంతరిక్ష వాసి సంఘంలో జరిగే ప్రతి వింతను తనదైన తార్కికతతో ప్రశ్నిస్తుంటాడు. ఈ చిత్రం హిరానీ-చోప్రా నుంచి ట్రేడ్ మార్క్ మూవీ అని చెప్పాలి. ఫన్నీగా ఉంటూనే ఎంతో ఆలోచింపజేస్తుంది.
మరోవైపు హిరాణీ అభిమానులు `మున్నా భాయ్` ఫ్రాంచైజీలో మూడవ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత విధువినోద్ శక్తివంతమైన కథల్ని ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా లాభాలు ఘడించారు. ``మేము డబ్బు సంపాదించే వ్యాపారంలో లేము. సినిమా చేసే వ్యాపారంలో ఉన్నాము. డబ్బు సంపాదించడం మా లక్ష్యం అయితే ఇప్పటికి మేము ఆరు నుండి ఏడు వాయిదాలు (సీక్వెల్స్) చేసేశాం. మున్నా భాయ్- రెండు నుండి మూడు (ఎడిషన్లు).. పీకే తెరకెక్కించాం. సినిమాలతోనే కొన్ని కోట్ల ఆనందం. అనందంతో పాటు శాంతిని సినిమాలతోనే కోరుకుంటాం`` అని విధు ఇంతకుముందు వెల్లడించారు. అంటూ పీకే సీక్వెల్ తో పాటు షారూక్ తోనూ అద్భుతమైన వ్యంగ్యాస్త్రాలను సంధిస్తారనే భావించాలి.