Begin typing your search above and press return to search.

ఒక్క రాత్రికి రేట్ చెబుతున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   10 Jun 2018 6:40 AM GMT
ఒక్క రాత్రికి రేట్ చెబుతున్న హీరోయిన్
X
సినిమా తారలను తమ అభిమానులకు సోషల్ మీడియా దగ్గర చేస్తున్న మాట నిజమే కానీ అదే ఇబ్బందులు కూడా కొని తెచ్చిపెడుతోంది. నేరుగా ముఖాముఖి చేసేది కాకపోవడం అడిగేవాళ్ళు ఎక్కడో దేశం కానీ దేశం నుంచి మెసేజ్ పంపడం లాంటి కారణాల వల్ల కొందరు దురభిమానులు నోరు జారినా ఏమి చేయలేని పరిస్థితి ఉంది. అలాంటి అనుభవమే సోఫియా హయత్ కు ఎదురైంది. గత ఏడాది ఆక్సర్ 2లో కనిపించిన ఈ హాట్ బ్యూటీ మరీ ఎక్కువ సినిమాలేమి చేయటం లేదు కానీ ఫోటో షూట్స్ ద్వారా ఫాన్స్ కోసం రెగ్యులర్ టచ్ లోనే ఉంటుంది. ఇటీవలే సోఫియా పోస్ట్ చేసిన ఒక హాట్ ఫోజుకు ఓ అభిమాని నుంచి మెసేజ్ వచ్చింది. అందులో ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటావ్ అని నేరుగా అడిగేశాడు. మామూలుగా అయితే ఫైర్ అయ్యే ఈ కొశ్చన్ కు సోఫియా కూల్ గా బదులిస్తూ ఇదే ప్రశ్న నీ తల్లిని సోదరిని భార్యని కానీ అడగమని చెప్పేసింది. దిమ్మ దిరిగే ఈ సమాధానానికి వేరొకడు అయితే సైలెంట్ అయిపోయి తప్పు తెలుసుకోవాలి. కానీ అందరు అలా ఉండరుగా.

దానికి అతను సమాధానం ఇస్తూ తన తల్లి సోదరి భార్య ఎవరు నీలా ఒళ్ళు చూపించరు కాబట్టి అడగను అని చెప్పాడు. సోఫియా మళ్ళి దీటుగా బదులిచ్చింది. నీ తల్లి నీకు జన్మనిచ్చినప్పుడు ఒళ్ళు చూపించి ఉంటుందని బార్లా చాపుకున్న కాళ్ళ మధ్య నుంచే నువ్వే వచ్చావనే సంగతి మర్చిపోవద్దని ఘాటుగా బదులిచ్చింది. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి మాటలు ఎలా వస్తాయని గట్టిగా నిలదీసింది. అంతే. సదరు అభిమాని దెబ్బకు సైలెంట్ అయ్యాడు. అయినా మోడలింగ్ పేరుతో విచ్చవిడి అందాల ప్రదర్శనకు తెగబడుతున్న హీరోయిన్లకు ఈ మాటల దాడి ఎక్కువయ్యింది. వీర్ దే వెడ్డింగ్ లో కరీనా కాస్త హాట్ గా కనిపించడం చూసి సైఫ్ అలీ ఖాన్ ఫాన్స్ కూడా నెగటివ్ గానే స్పందించారు. మా ఒళ్ళు మా ఇష్టం అని వాళ్ళు అంటున్నా చూస్తున్న కళ్ళు మావి కాబట్టి మా కామెంట్లు మా ఇష్టం అంటున్నారు నెటిజెన్లు. ఎవరికెవరు తగ్గటం లేదుగా.