Begin typing your search above and press return to search.

అమిగోస్‌ వ‌ర‌ల్డ్ లో సాఫ్ట్ వేర్ మంజునాథ్‌!

By:  Tupaki Desk   |   3 Jan 2023 8:30 AM GMT
అమిగోస్‌ వ‌ర‌ల్డ్ లో సాఫ్ట్ వేర్ మంజునాథ్‌!
X
టైమ్ ట్రావెల్ స్టోరీ నేప‌థ్యంలో సాగే ఫిక్ష‌న‌ల్ మూవీ 'బింబిసార‌'. చాలా రోజుల త‌రువాత ఈ మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. మ‌ల్లిడి వ‌శిష్టని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిన ఈ మూవీ ఆగ‌స్టులో విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని అందించి క‌ల్యాణ్ రామ్ ని మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టించింది. ఇందులో బింబిసారుడిగా, దేవ‌ద‌త్తుడిగా రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించిన క‌ల్యాణ్ రామ్ తాజాగా మ‌రో విభిన్న‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'అమిగోస్‌'. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా రాజేంద్ర‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుతున్నాడు. స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీలో హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ విభిన్న‌మై పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఓ పాత్ర‌ని ప‌రిచ‌యం చేశారు. తాజాగా మ‌రో పాత్ర‌కు సంబంధించిన లుక్ ని తాజాగా మంగ‌ళ వారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

డోప్‌ల్ గ్యాంగ‌ర్ అంటూ ఫ‌స్ట్ క్యారెక్ట‌ర్ ని ఎంట‌ర్ ప్రెన్యూయ‌ర్ సిద్ధార్ద్ గా ప‌రిచ‌యం చేసిన టీమ్ సెకండ్ క్యారెక్ట‌ర్ ని సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ మంజునాథ్ గా ప‌రిచ‌యం చేశారు. బిజినెస్ మెన్ సిద్ధార్ధ్ క్యారెక్ట‌ర్ లో స్టైలిష్ గా క‌నిపించిన క‌ల్యాణ్ రామ్ సెకండ్ క్యారెక్ట‌ర్ లో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా స్పెట్స్ ధ‌రించి క్లాస్ లుక్ లో క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. అమిగోస్ వ‌ర‌ల్డ్ లోని ఈ పాత్ర‌ల వెన‌కున్న క‌థేంటీ? .. ఇంత‌కీ అమిగోస్ వ‌ర‌ల్డ్ ఏంటీ అన్న‌ది ఆస‌క్తిక‌రం.

ఇంత వ‌ర‌కు ఫ‌స్ట్ లుక్ స్టిల్స్ ని మాత్ర‌మే విడుద‌ల చేసిన చిత్ర బృందం త్వ‌ర‌లో టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌నుంద‌ట‌. ఈ విష‌యాన్ని అధికారికంగా మంగ‌ళ‌వారం మేక‌ర్స్ వెల్ల‌డించారు. 2023 ఫిబ్ర‌వ‌రి 10న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా సినిమాటోగ్రాఫ‌ర్ గా ఎస్‌. సౌంద‌ర‌రాజ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ అవినాష్ కొల్ల‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.