Begin typing your search above and press return to search.
2 వీక్స్ కలెక్షన్: కెరియర్ లోనే పెద్ద హిట్
By: Tupaki Desk | 29 Jan 2016 1:38 PM GMTసోగ్గాడే చిన్ని నాయనా.. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల్లోకంటే కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరవయ్యే కంటెంట్ కావడంతో.. నాగార్జున బంగార్రాజు వేషం బాగా క్లిక్కవ్వడంతో.. ఈ సోగ్గాడి సంబరాలు చేసుకుంటున్నాడు.
నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రెండు వారాలు పూర్తి చేసుకున్న సోగ్గాడే చిన్ని నాయనా.. రెండు వారాల్లో.. 35.73 కోట్లు షేర్ రాబట్టింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమాకు 29.01 కోట్లు షేర్ వచ్చింది. అమెరికా నుండి 3.16 కోట్ల షేర్ - కర్ణాటక నుండి 2.65 కోట్ల షేర్ - తక్కిన ఏరియాలన్నీ కలుపుకుని 35 కోట్ల పై మేర రావడం అంటే.. ఇది నాగార్జున కెరియర్ లోనే అతి పెద్ద హిట్.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సాధారణంగా షేర్ అంటే.. ట్యాక్సులూ - డిస్ర్టిబ్యూటర్ల పర్సంటేజ్ తీసేశాక చెప్పే ఫిగర్. అలా చూస్తే నాగ్ కు 35 కోట్లు వచ్చినట్లు. కాని 55.96 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించిన ఈ సినిమాకు పంపిణీదారుడు కూడా నాగార్జునే. సో.. ఆ పర్సంటేజ్ కూడా మనోడికే వస్తుంది. అంటే ఇంకో 5 కోట్లు కలపొచ్చు మరి. ఆ విధంగా చూస్తే 40 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినట్లే. నిర్మాణం ప్లస్ రిలీజ్‌కు ఒక 15 కోట్లు తీసేసినా.. 25 కోట్లు లాభం. పండగ అంటే ఇదే.