Begin typing your search above and press return to search.

హిట్లు ఉన్నాడబ్బులు తెచ్చింది ఒకటే?

By:  Tupaki Desk   |   29 Feb 2016 3:30 PM GMT
హిట్లు ఉన్నాడబ్బులు తెచ్చింది ఒకటే?
X
కొత్త ఏడాది ప్రారంభమై రెండు నెలలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ రిలీజ్ అయినవాటిలో అనేక సినిమాలు హిట్ అనిపించుకున్నాయి. బ్లాక్ బస్టర్ అంటూ కూడా లిస్ట్ పెద్దదే ఉంది. కానీ అసలు లెక్కలు చూస్తే.. నిర్మాతలకు లాభాలు అందించినది ఒకే ఒక్క మూవీ అంటే ఆశ్చర్యం వేయకమానదు. నేను.. శైలజతో సూపర్ హిట్ మొదలుపెట్టి, డిక్టేటర్ - ఏక్స్ ప్రెస్ రాజా - సోగ్గాడే చిన్ని నాయన. నాన్నకు ప్రేమతో - కళావతి - కృష్ణగాడి వీర ప్రేమగాధ వరకూ మనకు రికార్డుల్లో బోలెడు హిట్స్ ఉన్నాయి. ఎక్స్ ప్రెస్ హిట్ - వీర హిట్ - హారర్ హిట్ అంటూ హంగామా కూడా బోలెడంత చేసేశారు.

కానీ ప్రతీ సినిమాపైనా కొనుగోలుదారులు 10 నుంచి 15శాతం వరకూ నష్టపోయారంటే ఆశ్చర్యం వేయకమానదు. నాన్నకు ప్రేమతో మూవీకి 50 కోట్లు వచ్చిన మాట రైటే. కానీ ఈ సినిమా నిర్మాణ ఖర్చు 54 కోట్లు అని మర్చిపోకూడదు. ఒకటి తప్ప ఎక్స్ ప్రెస్ రాజా - డిక్టేటర్ - నేను శైలజ - కృష్ణగాడి ప్రేమగాధతో సహా అన్ని సినిమాలు నష్టాలు మిగిల్చాయి. అదే నాగ్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన. పెట్టుమీద 20 కోట్లు లాభాలను ఆర్జించి రియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇది.

నిర్మాణ ఖర్చులు ఇంతగా పెరిగిపోయిన ఈ సమయంలో.. పక్కా ప్లానింగ్ తో సినిమా తీసి, పర్ ఫెక్ట్ గా హిట్ కొట్టి.. అదిరిపోయే కలెక్షన్ వసూళ్లు చేసిన సోగ్గాడే చిన్ని నాయన ఒక్కటే.. ఈ ఏడాది ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్. సాంకేతికంగా చెప్పాలంటే మిగతవాన్నీ యావరేజ్ కూడా కాదు.