Begin typing your search above and press return to search.
సోగ్గాడి పాటలతో ఫ్యాన్స్ ఖుషీ
By: Tupaki Desk | 26 Dec 2015 9:13 AM ISTఅక్కినేని నాగార్జున చెప్పినట్లుగానే కొట్టబోతున్నాడు. సోగ్గాడితో హలో బ్రదర్ రేంజ్ లో ఎంటర్ టెయిన్ మెంట్ హిట్ కొడతానని.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా నాగ్ చెప్పేశాడు. నాలుగు పాటలున్నాయని.. అన్నీ అద్బుతంగా ఇచ్చాడని అనూప్ ని పొగిడాడు కూడా. ఫంక్షన్ లో నాగార్జున చెప్పినా.. అన్నిపాటలను చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు అనూప్ రూబెన్స్.
మొదటి పాట ముంతలో కల్లు ఊరిస్త ఉంది.. అంటూ మొదలయ్యే పాటకు.. సంబరాలు చేసుకోరా సోగ్గాడు చిన్ని నాయనా.. అంటూ హై పిచ్ కి తీసుకెళ్లి.. డిక్క డిక్క డం డం అనే హమ్మింగ్ బీట్ ఇవ్వడం సూపర్ గా ఉంది. విజువల్ గా కూడా మొత్తం పల్లెటూరి వాతావరణంలో తీయడంతో.. చూసేందుకు కూడా బాగుండడం విశేషం. ఇక రెండో పాట టైటిల్ లాంగ్.. సోగ్గాడే చిన్ని నాయన అంటూ సాగుతుంది. కొత్త ట్యూన్ ఇచ్చి, అది బాగున్నా సరే.. ఓల్డ్ ట్యూన్ ని కూడా మిక్స్ చేసిన విధానం.. అనూప్ ట్యాలెంట్ కి నిదర్శనం అనాలి. ఇద్దరు నాగ్ లు, మొత్తం హీరోయిన్స్ అందరూ ఈ పాటలో దర్శనమిస్తున్నారు.
మూడో పాట ఏనాడో రాసున్నాదో.. కనుకే నువు నా తోడయ్యావే... అంటూ ప్రారంభవుతుంది. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే.. వస్తా వస్తా వస్తా నే నీ వెంటే వస్తానే.. అంటూ సాగే స్లో సాంగ్. నాగ్, రమ్య కృష్ణల మధ్య సాగుతుంది. హృదయాన్ని హత్తుకునేలా ఉంది. జల్సారాయుడైన హీరోకి.. భార్య మీద ఉన్న ప్రేమను చెప్పే పాట ఇది. ఇక చివరగా.. నీ నవ్వే హాయిగ ఉంది.. నీ ఊసే కొత్తగా ఉంది.. అంటూ కుర్ర నాగ్ ని ఉద్దేశించి పాడుకునే పాట.
ఒక ఆల్బంలో ఉన్న అన్ని పాటలను ఇంత క్యాచీగా ఇవ్వడమంటే చిన్న విషయం కాదు. సినిమాలో ఎంటర్టెయిన్మెంట్ కూడా ఫుల్లుగా ఉందని ఇప్పటికే అర్ధమవుతోంది. నాగ్ కూడా మాటిచ్చేశాడు. ఇక నాగ్ చెప్పినట్లు సంక్రాంతి పండక్కి హిట్ కొట్టడం ఒక్కటే బ్యాలెన్స్.