Begin typing your search above and press return to search.
భలే రికార్డ్.. 100 సెంటర్లలో 50 రోజులు
By: Tupaki Desk | 21 Feb 2016 11:30 AM GMTఈ రోజుల్లో ఒక సినిమా 25 రోజులు ఆడటం కూడా గగనంగా ఉంది. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ వచ్చినా మూడు వారాల తర్వాత థియేటర్లలో నిలబడటం కష్టంగా ఉంది. అలాంటిది 100 సెంటర్లలో ఓ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన అక్కినేని నాగార్జున సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఈ అరుదైన ఘనతను అందుకుంటోంది. ఈ మధ్య కాలంలో ‘బాహుబలి’ తర్వాత ఇన్ని సెంటర్లలో 50 రోజుల ప్రదర్శన చేసుకుంటున్న తెలుగు సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’నే కావడం విశేషం.
సోగ్గాడే చిన్నినాయనా విడుదలైంద కేవలం 400 సెంటర్లలోనే. ఐతే సినిమాకు చాలా మంచి టాక్ రావడం.. తొలి వారమంతా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ కావడంతో రెండో వారం దాదాపు 200 థియేటర్లు పెంచారు. మూడో వారంలో సైతం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచిన ఈ సినిమా.. నాలుగు వారాల్లోనే రూ.50 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు కొంచెం జోరు తగ్గించినప్పటికీ.. ఓ మోస్తరు కలెక్షన్లు వస్తున్నాయి. సంక్రాంతికి వచ్చిన మిగతా మూడు సినిమాలు ఇప్పటికే థియేటర్ల నుంచి వెళ్లిపోగా.. ‘సోగ్గాడే..’ మాత్రం ఇప్పటికీ చెప్పుకోదగ్గ సెంటర్లలో నడుస్తోంది. మొత్తంగా 100 సెంటర్లలో 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోబోతున్నట్లు నాగార్జునే స్వయంగా చెప్పాడు. ఇందులో బలవంతంగా సినిమాను ఆడించిన సెంటర్లేమీ లేవు. అందుకే ఈ రికార్డు జెన్యూన్.