Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : సోగ్గాడే చిన్ని నాయన
By: Tupaki Desk | 15 Jan 2016 9:42 AM GMT‘సోగ్గాడే చిన్నినాయనా’ రివ్యూ
నటీనటులు- అక్కినేని నాగార్జున - రమ్యకృష్ణ - లావణ్య త్రిపాఠి - అనుష్క - నాజర్ - సంపత్ - హంసానందిని - అనసూయ -దీక్షాపంత్ తదితరులు
సంగీతం- అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం- పి.ఎస్.వినోద్, సిద్దార్థ్
మూలకథ: రామ్మోహన్
స్క్రీన్ ప్లే- సత్యానంద్
నిర్మాత- అక్కినేని నాగార్జున
రచన, దర్శకత్వం- కళ్యాణ్ కృష్ణ
కొత్త దర్శకులకు అవకాశాలివ్వడంలో ఎప్పుడూ ముందుండే అక్కినేని నాగార్జున.. కళ్యాణ్ కృష్ణ అనే కుర్ర డైరెక్టర్ ను పరిచయం చేస్తూ సొంత బేనర్లో చేసిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. సంక్రాంతి రేసులో చివరగా.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి రేపిన ఈ చిత్రం అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ:
జమీందారు కుటుంబానికి చెందిన బంగార్రాజు ఓ ప్రమాదంలో చనిపోయి నరకానికి వెళ్తాడు. మంచి రసికుడైన బంగార్రాజు నరకంలో కూడా అమ్మాయిలతో సరసాలాడుతూ గడుపుతుండగా.. కింద ఉన్న అతడి భార్య అతణ్ని తిడుతూ కిందికి రమ్మంటుంది. ఇది ఈశ్వరేచ్ఛ అంటూ యముడు కూడా బంగార్రాజుకు గడువు పెట్టి కిందికి పంపిస్తాడు. కింద బంగార్రాజు కొడుకు రాము తండ్రికి పూర్తి విరుద్ధంగా ఉంటాడు. ఎప్పుడూ పనే ప్రపంచం అనుకునే రాము నుంచి విడిపోవాలనుకుంటుంది అతడి భార్య సీత. తన భార్య దీని గురించి మథన పడుతుండటంతో కొడుకు, కోడల్ని కలిపే బాధ్యత తీసుకుంటాడు బంగార్రాజు. అంతే కాదు.. తన కుటుంబానికి శత్రువుల నుంచి కాపాడుకోవాల్సి కూడా వస్తుంది. మరి బంగార్రాజు ఈ బాధ్యతల్ని ఎలా నెరవేర్చాడన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ:
నాగార్జున గత ఏడాది ‘మనం’ లాంటి మంచి విజయాన్నందుకున్నాడు. దానికి ముందు కూడా ఓ మోస్తరు సినిమాలు పడ్డాయి. అయినప్పటికీ అభిమానుల్లో ఏదో అసంతృప్తి. నాగ్ ‘హలో బ్రదర్’ తరహా ఎంటర్టైనర్లు చేస్తే చూడాలని వారి ఆశ. గత కొన్నేళ్లలో నాగ్ సినిమాలు చూస్తే ఆయన మళ్లీ ఆ తరహాలు ఇక ఎప్పటికీ చేయడమే అనిపించింది. ఐతే నాగ్ ఎట్టకేలకు అభిమానుల్ని అలరించే ఓ అల్లరి సినిమాతో వచ్చాడు. అదే.. సోగ్గాడే చిన్నినాయనా.
నాగార్జునకు రొమాంటిక్ కింగ్ అని పేరు. రొమాన్స్ విషయంలో నాగ్ కు సాటి వచ్చే హీరో టాలీవుడ్లో మరెవరూ లేరనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ తరం ప్రేక్షకులకు ఈ విషయంలో సందేహాలేమైనా ఉంటే ‘సోగ్గాడే చిన్నినాయనా’ చూడొచ్చు. సోగ్గాడి అవతారంలో నాగ్ అంతలా రెచ్చిపోయాడు. సినిమాలో బ్రహ్మానందం మినహాయిస్తే మరెవరూ కమెడియన్లు లేకున్నా.. ప్రత్యేకమైన కామెడీ ట్రాకులేమీ లేకున్నా.. కేవలం తన రొమాంటిక్ నటనతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ పండించాడు నాగ్. సినిమాకు బంగార్రాజు పాత్రే ప్రధాన ఆకర్షణ. ఈ పాత్రతో ఎంతగా కనెక్టయిపోతామంటే.. ఇలాంటి పాత్ర నిజ జీవితంలోనూ ఉంటే బావుంటుందే అని, మనం కూడా బంగార్రాజులాఅయిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. అంతగా ఆ పాత్రతో జనాల్లోకి చొచ్చుకుపోతాడు నాగ్.
వాసివాడి తస్సాదియ్యా అంటూ డిఫరెంట్ మేనరిజంతో తనకే సొంతమైన రొమాంటిక్ బాడీ లాంగ్వేజ్ తో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు బంగార్రాజు. ఆ పాత్ర తెర మీద కనిపిస్తున్నంతసేపూ ప్రేక్షకుడు ఈజీగా సినిమాతో కనెక్టయిపోతాడు. ప్రతి సన్నివేశంలోనూ అలా ఎంటర్టైన్ చేశాడు నాగ్. లేడీ క్యారెక్టర్లతో నాగ్ అల్లుకుపోయే తీరు చూస్తే రొమాన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. బంగార్రాజు చిలిపితనాన్నంతా చూపించే ప్రథమార్ధం వేగంగా సాగిపోతుంది. మధ్యలో కొంత బ్రహ్మానందం వాటా తీసుకున్నాడు కానీ.. మిగతా అంతా కూడా నాగార్జునే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యతను మోశాడు. ఆ పాత్రతో కలిసి ప్రయాణం చేస్తూ సునాయాసంగా ప్రథమార్ధాన్ని దాటేస్తాం.
ఐతే ద్వితీయార్ధంలోనూ ఈ రొమాంటిక్ వేషాలతోనే బండి లాగించేస్తే బాగోదు కాబట్టి.. బంగార్రాజు నెరవేర్చాల్సిన రెండో బాధ్యత మీదికి దృష్టిమళ్లించారు. ఐతే ఈ వ్యవహారం మామూలుగా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ మాత్రం చాలా పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. ద్వితీయార్ధంలో కొంచెం సాగతీత కూడా ఉండటంతో బండి నడవడం కష్టమవుతుంది. రాము, సీతల మధ్య బాండ్ క్రియేటయ్యే సన్నివేశాలు, పాట బాగున్నాయి. బ్రహ్మానందం పాత్రతో వినోదం పండించడానికి చేసి.. పాటల పేరడీ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ పర్వాలేదు. ద్వితీయార్ధంలో లెంగ్త్ ఎక్కువవడం.. ఎంటర్టైన్మెంట్ తగ్గడంతో సినిమా గ్రాఫ్ కొంచెం పడిపోయింది. ఓవరాల్ గా సంక్రాంతి పండక్కి కరెక్టుగా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే వినోదం ఉంది ఇందులో. బంగార్రాజు పాత్ర ఒక్కటి చాలు.. ప్రేక్షకుల టికెట్ డబ్బులు గిట్టుబాటు చేయడానికి.
నటీనటులు:
నాగార్జున చాన్నాళ్ల తర్వాత సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. ఇటు బంగార్రాజు పాత్రలో ఎంతగా చెలరేగిపోయాడో.. అటు అమాయక రాము పాత్రలోనూ అంతే బాగా నటించాడు. రెండు పాత్రల్లో వైవిధ్యం బాగా చూపించాడు. బంగార్రాజు పాత్రతో అయితే ఎవ్వరైనా ప్రేమలో పడిపోవాల్సిందే. నాగ్ అభిమానులైతే మెస్మరైజ్ అయిపోతారు. నాగ్ లోని రొమాంటిక్ యాంగిల్ చూడని ఈ తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూశాక ఆయన్ని అభిమానిస్తారు. రమ్యకృష్ణ సినిమాకు మరో ఆకర్షణ. ఆమెను కాకుండా సత్య పాత్రలో వేరొకరిని ఊహించుకోలేం అన్నట్లుగా నటించింది. నాగ్ తో ఆమె కెమిస్ట్రీ మరోసారి బాగా వర్కవుటైంది. రెండు మూడు సన్నివేశాల్లో రమ్య కన్నీళ్లు పెట్టించేలా నటించింది. లావణ్య త్రిపాఠి అందంగా కనిపించి ఆకట్టుకుంది. నటన పర్వాలేదు. నాజర్, సంపత్ కూడా బాగానే చేశారు. బ్రహ్మానందం ఓ మోస్తరుగా నవ్వించాడు. అనసూయ, హంసానందిని ఇలా మెరిసి అలా మాయమయ్యారు. అనుష్క మరోసారి నాగ్ కోసం ఓ ఐదు నిమిషాలు కనిపించింది కానీ.. ఆమె అవతారం అంతగా ఆకట్టుకోదు.
సాంకేతిక వర్గం:
అనూప్ రూబెన్స్ మరోసారి నాగ్ కోసం సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ కూడా సినిమాలో బాగా ఇమిడిపోయాయి. వస్తానే వస్తానే.. అన్నింటికంటే బాగా ఆకట్టుకుంటుంది. పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ఐతే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్నిసార్లు మరీ లౌడ్ గా అనిపిస్తుంది. పి.ఎస్.వినోద్, సిద్దార్థ్ కలిసి అందించిన ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఎడిటింగ్ ద్వితీయార్ధంలో బాగా లేదు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఓ అనుభవజ్నుడిలా సినిమాను డీల్ చేశాడు. బంగార్రాజు పాత్రను అతను తీర్చిదిద్దిన తీరు.. దాన్ని తెరమీదికి తీసుకొచ్చిన వైనం ఆకట్టుకుంటుంది. నిజానికిది పాత తరహా పాత్ర. ఇలాంటి పాత్రలు ఇప్పుడు బయటా కనిపించవు. సినిమాల్లోనూ అరుదైపోయాయి. అలాంటి పాత్ర నేపథ్యంలో కథాకథనాలు తీర్చిదిద్దడం.. అవి జనాలకు కనెక్టయ్యేలా చేయడం సవాలే. ఈ విషయంలో కొత్త దర్శకుడైన కళ్యాణ్ బాగానే సక్సెస్ అయ్యాడు. ద్వితీయార్ధంలో రొటీన్ దారిలోకి వెళ్లిపోవడమే నిరాశ పరుస్తుంది. కళ్యాణ్ రాసిన మాటలు కూడా బావున్నాయి. సత్యానంద్ స్క్రీన్ ప్లే కూడా ఓకే.
చివరగా: తస్సాదియ్యా.. బాగుంది సోగ్గాడి వినోదం
రేటింగ్- 3/5