Begin typing your search above and press return to search.

నేనే నెంబర్ వ‌న్ అంటున్న నాగ్

By:  Tupaki Desk   |   18 Jan 2016 4:28 AM GMT
నేనే నెంబర్ వ‌న్ అంటున్న నాగ్
X
నెంబ‌ర్ గేమ్‌ కి నాగార్జున ఎప్పుడూ దూర‌మే. ఇండ‌స్ట్రీలో ఆ ప్లేసుల‌కోసం ఎవ‌రు కొట్టుకున్నా నాగ్ మాత్రం ఆ విష‌యంతో మ‌న‌కు సంబంధ‌మే లేద‌న్న‌ట్టు క‌నిపిస్తుంటాడు. రికార్డుల గురించి కూడా అస్స‌లు ప‌ట్టించుకోడు. మంచి సినిమా చేస్తే అదే అన్నింటికీ స‌మాధానం చెబుతుంద‌న్న‌ట్టుగా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. అలాంటి నాగార్జున తొలిసారి నేనే నెంబ‌ర్ వ‌న్ అని బ‌హిరంగంగా ప్ర‌క‌టించేశాడు. ఆ మాట విన్నప్ప‌ట్నుంచి అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధుల్లేవు.

నాగార్జున నేనే నెంబ‌ర్ వ‌న్ అన్న‌ది సంక్రాంతికొచ్చిన సినిమాల విష‌యంలోనే అయినా ఆ సౌండింగ్ మాత్రం అక్కినేని అభిమానుల‌కి కొత్త కిక్కునిచ్చింది. సోగ్గాడే చిన్నినాయ‌నా స‌క్సెస్ ఇచ్చిన ఉత్సాహంలోనే నాగ్ ఆ మాట అన్నాడు. నిజంగానే సోగ్గాడే... సంక్రాంతి విన్న‌ర్‌ గా నిలిచేట్టు క‌నిపిస్తున్నాడు. సంక్రాంతి బ‌రిలోకి హేమాహేమీల్లాంటి సినిమాలు దిగాయి. వాటిలో సోగ్గాడు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. బీ, సీ సెంట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఆ సినిమాకి బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. ఏ సెంట‌ర్ల‌లోనూ నాగ్ రొమాన్స్‌ ని చూడ‌టానికి వెళుతున్నారు. దీంతో నాగ్ సినిమాల్లోకెళ్లా అత్య‌ధిక ఓపెనింగ్స్ సోగ్గాడేకి ల‌భిస్తున్నాయి. రెండో వారంలో సినిమా మ‌రింత విజృంభించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇలాంటివ‌న్నీ చూసుకొనే నాగ్ నెంబ‌ర్ వ‌న్ అనేశాడ‌న్న‌మాట‌.