Begin typing your search above and press return to search.

బ్రేకప్ రెడీ అయిన మరో జంట!!

By:  Tupaki Desk   |   15 April 2016 1:30 PM GMT
బ్రేకప్ రెడీ అయిన మరో జంట!!
X
బాలీవుడ్ లో బ్రేకప్ సాగా నడుస్తూనే ఉంది. వరుసగా సెలబ్రిటీ జంటలు విడిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో జంట కూడా విడిపోవడానికి రెడీ అయిపోయారని తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ చెల్లెలు సోహా ఆలీ ఖాన్. ఈమె గతేడాది ప్రారంభంలోనే కునాల్ ఖేమును పెళ్లి చేసుకుంది. జనవరిలోనే ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట మధ్య విబేధాలు తలెత్తాయని తెలుస్తోంది. వివాహ జీవితం ప్రారంభించడం, పిల్లలను కనడంలో వచ్చిన అభిప్రాయ బేధాలే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

త్వరగా పిల్లలను ఎత్తుకుందామనే ఆరాటంలో ఉన్నాడట కునాల్. అయితే.. సోహా మాత్రం ఇప్పట్లో పిల్లలను కనే ఉద్దేశ్యం లేదని తేల్చేసిందని అంటున్నారు. కునాల్ తల్లిదండ్రులు కూడా మనవళ్ల కోసం ఎదురుచూస్తున్నారట. దీనిపై వచ్చిన విబేధాలే ఇప్పుడు గొడవలకు దారి తీశాయని.. అందుకే సోహా ఆలీ ఖాన్ - కునాల్ ఖేములు బ్రేకప్ కి రెడీ అయిపోయారని అంటున్నారు. ప్రస్తుతం వీరి మధ్య సయోధ్య చేకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.