Begin typing your search above and press return to search.
సోహా పుస్తకం రాసేసిందహో
By: Tupaki Desk | 14 Nov 2017 5:14 AM GMTసోహా ఆలీ ఖాన్.. గత దశాబ్ద కాలానికి పైగా బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాల్లో నటించేసింది. రెండేళ్ల క్రితం కునాల్ ఖేమును పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది కూడా. రెండు నెలల క్రితం ఓ చిన్నారికి జన్మను ఇచ్చిన సోహా.. ఇప్పుడు తను రాసిన ఓ పుస్తకాన్ని విడుదల చేస్తోంది.
పుట్టుకతోనే తాను యువరాణిని అంటున్న సోహా.. మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ- షర్మిలా టాగూర్ ల కుమార్తె అనే సంగతి తెలిసిందే. సైఫ్ ఆలీ ఖాన్ వంటి సూపర్ స్టార్ కు సోదరి. కరీనా కపూర్ ఖాన్ వంటి మరో స్టార్ హీరోయిన్ కు వదిన. ఒక కుటుంబంలో ఇంత మంది స్టార్స్ ఉండడం అత్యంత అరుదైన విషయం. అయితే.. ప్రతీ ఒక్కరూ ఈమెతో మొదటిసారి మాట్లాడినపుడు.. నువ్వు ఇలా ఉంటావని.. మాట్లాడతావని అస్సలు అనుకోలేదని చెబుతారట. అందుకే తన నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చెప్పేందుకు ఓ పుస్తకం రాసేసింది సోహా ఆలీ ఖాన్. 'ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్' అనే పేరుతో పుస్తకానికి.. కవర్ పేజ్ ను ఇంట్రడ్యూస్ చేసింది సోహా.
'నేను కాలేజ్ లో హిస్టరీ స్టూడెంట్ ని. అందుకే పెద్ద పెద్ద వ్యాసాలు రాయాల్సి వచ్చేది. అప్పటి నుంచి చాలామంది నేను బాగా రాస్తానని అనేవారు. ఏదో ఒక రోజు పుస్తకం రాస్తావని కూడా అనేవారు. నాకు చదవడం అంటే బాగా ఇష్టం. అయితే.. ఒక రీడర్ కావడానికి.. రాయగలగడానికి చాలానే అంతరం ఉంది' అంటూ.. ఈ పుస్తకం రాయడం వెనక నేపథ్యాన్ని వివరించింది సోహా ఆలీ ఖాన్.