Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ మెమరీస్ తో ఏం చేసిందంటే
By: Tupaki Desk | 30 Jan 2017 3:56 PM GMTబాలీవుడ్ తారలు పుస్తకాలు రాసే కల్చర్ బాగానే ఊపందుకుంటోంది. కొందరు తమ స్వానుభవాలను పుస్తకాలుగా మలుస్తుంటే.. మరికొందరు తమలోని రచనా పటిమను బైటకు తీస్తున్నారు. అక్షయ్ కుమార్ భార్య కం మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఇప్పటికే ఈ విషయంలో ముందుండగా.. ఇప్పుడు సైఫ్ ఆలీ ఖాన్ సోదరి సోహా ఆలీ ఖాన్ కూడా ఓ పుస్తకాన్ని రాసేసింది.
'ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్' అనే టైటిల్ పై రాసిన ఈ పుస్తకంలో ఆమె జీవితంలో సరదా సంగతులతో పాటు ఎదుర్కున్న కష్టాలకు సంబంధించిన కథలు కూడా ఉంటాయట. ఒక రాయల్ ఫ్యామిలీకి వారసురాలిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచానని చెబుతోంది సోహా ఆలీ ఖాన్. 'నన్ను పుస్తకం రాయమని ప్రోత్సహించిన వారందరికీ తలో డాలర్ ఇవ్వాలంటే.. నా దగ్గర ఆరు డాలర్స్ ఉంటే చాలు. నేను చాలా వేగంగా అంటే నిమిషానికి సగటున 510 పదాల చొప్పున చదువుతాను.. బాగా రాయడానికి ఇది సరిపోతుందని భావించాను. నా మెమరీస్ నే పుస్తకంగా మలిచాను' అని చెప్పిన సోహా.. చదవాలని అనుకునే వారికి కొన్ని హెచ్చరికల్లాంటి సూచనలు కూడా చేసింది.
'ఈ పుస్తకంలో కరీనా కపూర్ శరీర సౌందర్యం గురించి.. యాక్షన్ సినిమాకి సైఫ్ ఎలా సిద్ధమవుతాడనే సంగతుల కోసం అయితే మాత్రం.. మీరు సరైన పుస్తకం ఎంచుకోనట్లే. ఎందుకంటే నేను రియాలిటీకి దగ్గరా ఉండేవి మాత్రమే పుస్తకంలో పొందుపరిచాను' అని చెప్పింది సోహా ఆలీ ఖాన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/