Begin typing your search above and press return to search.

పెద్దోడికి పనవ్వలేదు.. చిన్నోడికి ఏమవుద్దో?

By:  Tupaki Desk   |   29 May 2017 6:11 AM GMT
పెద్దోడికి పనవ్వలేదు.. చిన్నోడికి ఏమవుద్దో?
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి 50 ఏళ్ల వయసు దాటిపోయినా.. ఇప్పటివరకూ తనకంటూ ఓ ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోలేదు కానీ.. ఫ్యామిలీ రిలేషన్స్ కి ఈ హీరో బోలెడంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. ముఖ్యంగా తమ్ముళ్ల విషయంలో సల్మాన్ కేర్ చూస్తే ఆశ్చర్యం వేయక మానదు.

సల్మాన్ తమ్ముళ్ళు అర్బాజ్ ఖాన్.. సోహెయిల్ ఖాన్. మెగాస్టార్ జై చిరంజీవ మూవీ విలన్ గా మనకు కూడా పరిచయమున్న అర్బాజ్ ఖాన్ దబాంగ్ 2 చేశాడు సల్లూ భాయ్. దబాంగ్ కు నిర్మాత అయిన అర్బాజ్.. దబాంగ్2కు ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ కూడా. అంతే కాదు మూవీలో కీలకమైన రోల్ చేశాడు కూడా. అయితే.. ఆ సినిమా తెగ ఆడేసి డబ్బులు కురిపించేసినా.. అర్బాజ్ అటు డైరెక్టర్ గా కానీ.. యాక్టర్ గా కానీ బ్రేక్ రాలేదు. ఇప్పుడు చిన్నోడు సొహెయిల్ తో ట్యూబ్ లైట్ మూవీ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్.

ఈ ట్యూబ్ లైట్ లో సల్మాన్ ఖాన్ తర్వాత.. కీలక పాత్ర సోహెయిల్ దే కావడం విశేషం. యాక్టర్.. రైటర్.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసేసే సోహెయిల్ ఖాన్.. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఓ సినిమా చేస్తున్నాడు. యాక్టర్ గా ఈ సినిమాతో సోహెయిల్ కు బ్రేక్ ఇవ్వడం సల్మాన్ టార్గెట్. మరి ఇప్పుడు ట్యూబ్ లైట్ మూవీ ఆన్ లైన్ లో సెన్సేషన్స్ సృష్టిస్తోంది. సక్సెస్ పై పెద్దగా అనుమానాలు లేవు. మరి ఈ ట్యూబ్ లైట్ సోహెయిల్ కెరీర్ లో ఏ మాత్రం వెలుగులు నింపుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/