Begin typing your search above and press return to search.

సింగరేణిపై సినిమా తీస్తా : సోహైల్

By:  Tupaki Desk   |   3 Jan 2021 5:14 AM GMT
సింగరేణిపై సినిమా తీస్తా : సోహైల్
X
కథ వేరే ఉంటది..’ అంటూ బిగ్ బాస్ సీజన్-4లో సింగరేణి ముద్దుబిడ్డ సొహైల్ చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆనందమైనా, బాధ అయినా చిన్న పిల్లాడిలా రియాక్ట్ అవుతూ ముందుకు సాగిన సొహైల్.. క్రమంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు. మొదట్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన సోహైల్.. ఆ తరువాత తన టెంపర్ కొనసాగిస్తూ గ్రాండ్ ఫినాలే వరకూ దూసుకొచ్చాడు. టైటిల్ పోరులో నువ్వానేనా అన్నట్టు గేమ్ ఆడిన సోహైల్.. ఆ తర్వాత అమౌంట్ తీసుకొని డ్రాప్ అయ్యాడు. మూడో ప్లేసులో నిలిచాడు.

అయితే.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా తాను సినిమా తీస్తానని చెప్పిన సోహైల్.. ఆ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నాడు. సింగరేణిపై సినిమా తీయాలని ఉందంటూ ఇటీవల తన కోరికను వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు లేటెస్ట్ గా కరీంనగర్‌లోని ఒక హోటల్‌లో సోహైల్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు సోహైల్.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో తనకు ఓటు వేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు సోహైల్. ముఖ్యంగా సింగరేణి, కరీంనగర్ ప్రజలకు థ్యాంక్స్ చెబుతున్నానన్నాడు. కాగా.. సోహెల్ ఇప్పటికే కొన్ని సినిమాలకు సంతకం చేసినట్లు సమాచారం. బిగ్ బాస్ తో క్రేజ్ రావడంతో.. సోహైల్ తో సినిమా చేయడానికి పలువురు ముందుకు వస్తున్నారు. ఇందులో ఒక చిత్రం గురించి ఇటీవలే ప్రకటించారు. మిగిలిన ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.