Begin typing your search above and press return to search.

ఈ తేదీకి ఘనమైన సినీ చరిత్ర ఉంది..!

By:  Tupaki Desk   |   9 May 2020 4:00 AM GMT
ఈ తేదీకి ఘనమైన సినీ చరిత్ర ఉంది..!
X
మే 9.. ఈ తేదీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉన్నట్లే ఈ తేదీకి కూడా ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా సినీ అభిమానులు ఈ తేదీని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే సినీ పంచాంగం ప్రకారం ఈ తేదీని లక్కీ డే గా భవిస్తూ ఉంటారు సినీ ఇండస్ట్రీ వారు. ఈ తేదీన విడుదలైన సినిమాలు కచ్చితంగా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతాయని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ తేదీన రిలీజైన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అందుకే ఈ తేదీన సినిమాలు రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ ఈ ఒక్క ఏడాది మాత్రమే ఏ ఒక్క సినిమా ఈ రోజు రిలీజ్ కాలేదు.

మెగాస్టార్ చిరంజీవి - శ్రీదేవి కలిసి నటించిన 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' సినిమా రిలీజయింది ఈ రోజే. వైజయంతీ మూవీస్ అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి 30 ఏళ్ళైనా ఇప్పటికీ ఆ సినిమాలోని ఫ్రెష్ నెస్ సినీ అభిమానులు ఇష్టపడుతుంటారు. లోకనాయకుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' సినిమా కూడా రిలీజయింది మే 9వ తేదీనే. ఈ సినిమా సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. అవినీతి మీద సినిమాలు తీయాలంటే ఇప్పటికీ ఈ సినిమానే రిఫరెన్స్ గా తీసుకుంటారు.

అలానే విక్టరీ వెంకటేష్ - అంజలా జవేరి కాంబినేషన్ లో వచ్చిన 'ప్రేమించుకుందాం రా' సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ లో జయంత్ సి పరాంజీ డైరెక్షన్ లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలికిందని చెప్పవచ్చు. అలానే అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన 'మహానటి' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ రోజే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ - సమంత - విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అవార్డులతో పాటు రివార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మైలురాయి సిల్వర్ జూబ్లీ సినిమాగా వచ్చిన 'మహర్షి' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిర్మాణంలో కూడా వైజయంతీ మూవీస్ భాగస్వామిగా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజును వైజయంతీ మూవీస్ అశ్వినీ దత్ సెంటిమెంటుగా భావిస్తాడు.

అంతేకాకుండా ఈ రోజు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు బర్త్‌ డే వేడుకలు జరుపుకుంటున్నారు. టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, ఫిదా బ్యూటీ సాయి పల్లవి, బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు, హీరో రానా తమ్ముడు అభిరామ్‌ ల బర్త్‌డే కూడా ఈ రోజే. అందుకే ఈ తేదీ సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని తేదీగా గుర్తింపు పొందింది. ఇన్ని ప్రత్యేకతలతో మే 9వ తేదీ సినీ జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.