Begin typing your search above and press return to search.

థియేట్రికల్ రిలీజైన వారానికే డిజిటల్ రిలీజ్ కి వెళ్తున్న సినిమా..?

By:  Tupaki Desk   |   30 Dec 2020 1:30 PM GMT
థియేట్రికల్ రిలీజైన వారానికే డిజిటల్ రిలీజ్ కి వెళ్తున్న సినిమా..?
X
కరోనా నేపథ్యంలో కొన్ని నెలల తర్వాత ఓ పెద్ద సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఇన్ని రోజులు కేవలం ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకులకు మళ్లీ థియేటర్ అనుభూతి కలిగించిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. మెగా హీరో సాయి తేజ్ నటించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై నిర్మితమైన ఈ సినిమా రైట్స్ జీ గ్రూప్ వారు దక్కించుకున్నారు. ఇన్నాళ్లూ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలా థియేటర్స్ లో విడుదల చేయాలా అని ఆలోచించిన జీ స్టూడియోస్ వారు చివరకు 'సోలో బ్రతుకే..' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలను ఈ మూవీ పటాపంచలు చేస్తూ మంచి కలెక్షన్స్ రాబడుతుంతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ కి కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్న జీ గ్రూప్.. ఈ చిత్రాన్ని ఒక వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని జనవరి 1వ తేదీ నుంచి జీ ప్లెక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంచబోతున్నారట. దీని కోసం పే పర్ వ్యూ పద్ధతిలో 149 రూపాయలు టికెట్ ధర పెట్టబోతున్నారట. అంతేకాకుండా టాటా స్కై - ఎయిర్ టెల్ డీటీహెచ్ - డిష్ టీవీ - డీ2హెచ్ సబ్ స్క్రైబెర్స్ కి కూడా అందుబాటులో ఉంచుతారట. ఇక జీ5 యాప్ లో ఫిబ్రవరి నుంచి ఫ్రీ గా చూసే అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే థియేట్రికల్ రిలీజైన వారానికే డిజిటల్ రిలీజ్ అయిన సినిమాగా 'సోలో బ్రతుకే..' నిలుస్తుంది. థియేటర్స్ లో మంచి వసూళ్ళను రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుందేమో చూడాలి.