Begin typing your search above and press return to search.
ప్రసాద్ గారి ధైర్యంకు హ్యాట్సాఫ్
By: Tupaki Desk | 13 Dec 2020 12:22 PM GMTకరోనా కారణంగా మూత పడ్డ థియేటర్లు మళ్లీ ఓపెన్ అయినా కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. థియేటర్లను ప్రేక్షకులు పట్టించుకోవాలి అంటే కాస్త కంటెంట్ ఉన్న సినిమాలు లేదా స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలు విడుదల అవ్వాలి. ఈ సమయంలో ధైర్యం చేసి ఎవరు కూడా సినిమాలను ముఖ్యంగా కాస్త ఫేమ్ ఉన్న హీరోల సినిమాలు కాని మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను కూడా విడుదల చేయడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలకు సిద్దం అయిన చాలా సినిమాలు కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాయి తప్ప విడుదలకు మాత్రం ముందుకు రావడం లేదు.
ఇలాంటి సమయంలో జనాలు థియేటర్లకు రావడం లేదు అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. థియేటర్లకు జనాలు రావాలంటే ముందుగా సినిమాలు విడుదల అవ్వాలి. వర్మ కరోనా వైరస్ వంటి సినిమాలు మినహా కాస్త అయినా ఫేమ్ ఉన్న సినిమాలు విడుదల అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సోబెటర్' సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. వెంటనే సినిమాను విడుదల చేయాలనే నిర్ణయించుకున్నారు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా.. జనాలు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానం ఉన్నా కూడా ఈ సినిమా నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ థియేటర్ రిలీజ్ కే ముందుకు వచ్చాడు.
ఇది చాలా పెద్ద రిస్క్ అయినా కూడా ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా అని ప్రసాద్ గారు తన సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం అంటూ ఒక థియేటర్ యజమాని అంటున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చి థియేటర్లకు జనాలు వస్తే ఖచ్చితంగా వెంటనే మరికొన్ని సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.