Begin typing your search above and press return to search.

మెగా హీరో అంతటి సాహసం చేసేనా?

By:  Tupaki Desk   |   23 Oct 2020 11:50 AM GMT
మెగా హీరో అంతటి సాహసం చేసేనా?
X
కరోనా కారణంగా ఏడు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఎట్టకేలకు ఒకొక్కటి చొప్పున గత వారం రోజులుగా ఓపెన్‌ అవుతున్నాయి. థియేటర్లు ఓపెన్‌ అయినా కూడా కొత్త సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. పెద్ద సినిమాలు మాత్రమే కాదు కనీసం చిన్న సినిమాలు కూడా థియేటర్లలో విడుదలకు రెడీగా లేవు. ఈ ఏడాది మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందని అంతా భావించారు. తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఇండియాలో థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ కావు. అప్పటి వరకు చిన్న సినిమాలతో సహా ఏ సినిమాలు విడుదల కావు అనుకున్నాం. కాని మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఊపు జోరు చూస్తుంటే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో అనిపిస్తుంది.

సోలో బ్రతుకే సోబెటర్‌ అంటూ తేజ్‌ సినిమా చేశాడు. ఇప్పటికే సినిమా పూర్తి అయ్యింది. లాక్‌ డౌన్‌ తర్వాత బ్యాలన్స్ వర్క్‌ పూర్తి చేసి సినిమా నిర్మాణానంతర కార్యకర్రమాలు కూడా పూర్తి చేశారు. ఇటీవల సినిమాను సెన్సార్‌ వారి ముందుకు తీసుకు వెళ్తే వారు ఆలస్యం ఏమీ లేకుండా కట్స్‌ ఏమీ చెప్పకుండా క్లీన్‌ యూ ఇచ్చేశారు. క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ తో సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్‌ సిద్దం అయ్యారు. డిజిటల్‌ గా విడుదల చేసేందుకు సెన్సార్‌ క్లియరెన్స్‌ కూడా అక్కర్లేదు. కాని ఈ సినిమాకు సెన్సార్‌ చేయించారు అంటే ఖచ్చితంగా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారని మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది.

అదే కనుక నిజం అయితే మేకర్స్ చాలా పెద్ద సాహసం చేస్తున్నట్లే. ఎందుకంటే సినిమా థియేటర్లు ఇంకా 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా నడిచేందుకు పూర్తి స్థాయిలో ఓపెన్‌ కాలేదు. ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేస్తే ప్రింట్‌ ఖర్చులు మరియు ప్రమోషన్‌ ఖర్చులు కూడా రావనేది విశ్లేషకుల అభిప్రాయం. కనుక ఈ సినిమాను ఈ విపత్కర పరిస్థితుల్లో విడుదల చేసి అంతటి నష్టంను చవిచూడకపోవచ్చు అనిపిస్తుంది. సెన్సార్‌ పూర్తి చేయించి విడుదలకు అనువైన సమయం కోసం వెయిట్‌ చేస్తున్నారేమో. త్వరలోనే విడుదల విషయంలో మేకర్స్‌ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.