Begin typing your search above and press return to search.
మిలియన్ డాలర్లు ఒక్క సినిమాతో సంపాదించిన డైరెక్టర్
By: Tupaki Desk | 20 Jan 2023 1:30 AM GMTఇటీవల రస్సో బ్రదర్స్ -అవెంజర్స్ ఫ్రాంఛైజీ గురించి.. లేకపోతే జేమ్స్ కామెరూన్ అవతార్ ఫ్రాంఛైజీ గురించి ఎక్కువగా చర్చ సాగింది. కానీ అంతకుముందు ఎంతో క్రేజ్ తో నిరంతరం చర్చల్లో నిలిచిన గ్రేట్ ఫ్రాంఛైజీ `జురాసిక్ పార్క్`. స్టీవెన్ స్పీల్ బర్గ్ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సినిమా ఫ్రాంచైజీలలో ఒకటిగా పరిగణనలో ఉంది. ఈ ఫ్రాంఛైజీలో మొదటి చిత్రం 1993లో విడుదలైంది. గొప్ప కథాంశం.. తీవ్రమైన మానసిక స్థితి .. టెర్రిఫిక్ విజువల్స్ తో ఈ సినిమా మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అప్పటి నుండి ఈ ఫ్రాంచైజీ నుంచి 5 సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు తదుపరి భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే 1993 చిత్రం `జురాసిక్ పార్క్` గురించి ఎవరికీ తెలియని కొన్ని అద్భుతమైన వాస్తవాలను తెలుసుకుని తీరాలి. ఈ ఫ్రాంచైజీ ఆరంభంలో దర్శకుడి కష్టనష్టాల గురించి కొంత తెలుసుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది.
* `జురాసిక్ పార్క్` ఓవర్సీస్ మార్కెట్ లో మొత్తం 900 మిలియన్ యుఎస్ డాలర్లు వసూలు చేసి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 1997లో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన `టైటానిక్` ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ యూఎస్ డాలర్లకు పైగా రాబట్టి రికార్డును బద్దలు కొట్టింది.
* స్టీవెన్ స్పీల్ బర్గ్ అమెరికన్ టీవీ షో ER కోసం మైఖేల్ క్రిచ్ టన్ తో కలిసి పనిచేసినప్పుడు `జురాసిక్ పార్క్` గురించి తెలుసుకున్నాడు. క్రిక్టన్ `జురాసిక్ పార్క్` అనే నవల రాసి స్పీల్ బర్గ్ కి చెప్పాడు. స్పీల్ బర్గ్ ఎంతగానో మంత్రముగ్ధుడయ్యాడు. అతడు ఈ పుస్తకం ప్రచురించక ముందే దాని కాపీరైట్స్ ను వెంటనే కొనుగోలు చేశాడు.
* డా. అలాన్ గ్రాంట్ పాత్రను మొదట హారిసన్ ఫోర్డ్ కు ప్రతిపాదించారు. అయితే ఆ పాత్ర తనకు సరిపోదని భావించి అతను దానిని తిరస్కరించాడు. సామ్ నీల్ చివరకు ఈ పాత్రను పోషించాడు. మిగిలినది చరిత్ర.
* తాత పాత్రను మొదట ప్రముఖ నటుడు సీన్ కానరీకి ఆఫర్ చేశారు. కానీ అతను దానిని తిరస్కరించాడు. అప్పుడు రిచర్డ్ అటెన్ బరో ఆ పాత్రను పోషించాడు. ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే అతను 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక చిత్రంలో కనిపించాడు. సినిమాలో ఆ పాత్రను మంచివాడిగా చూసినా.. పుస్తకంలో మాత్రం నిజానికి చెడ్డవాడే.
* సినిమాలో ప్రేక్షకులు వినే టైరన్నోసారస్ గర్జనలు పులి- ఏనుగు- సింహం- పెంగ్విన్- ఎలిగేటర్ - కుక్క శబ్దాల కలయిక తప్ప మరొకటి కాదు. వింత శబ్ధాలతో ఆర్.ఆర్ దడ పుట్టిస్తుంది. శబ్ధంలో నేచురాలిటీ కట్టి పడేస్తుంది.
*జురాసిక్ పార్క్ సినిమా నిడివి 2 గంటల 7 నిమిషాలే అయినా డైనోసార్ లను మనం 15 నిమిషాలే తెరపై చూడగలుగుతాం. హవాయిలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నటీనటులు మరియు సిబ్బంది భారీ హరికేన్ తో దెబ్బతినడంతో ఒక రోజు పాటు నిర్మాణాన్ని ఆపేయాల్సి వచ్చింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కంట్రోల్ రూమ్ లోని పరికరాలు 1 మిలియన్ US డాలర్ల విలువైనవి అన్నీ అప్పు చేసి తెచ్చినవే.
* `జురాసిక్ పార్క్` లోగో అందరికీ నచ్చింది. చిప్ కిడ్ ఒరిజినల్ నవల కోసం దీనిని రూపొందించారు. తరువాత సినిమా పంపిణీదారులు దానిని ఎంతగానో ఇష్టపడ్డారు. వారు దాని హక్కులను కొనుగోలు చేశారు. స్టీవెన్ స్పీల్ బర్గ్ ఒక్కడే `జురాసిక్ పార్క్` ద్వారా 250 మిలియన్ US డాలర్లు సంపాదించాడు. ఇది ఒక సినిమా నుండి ఒక వ్యక్తి సంపాదించిన అత్యధిక మొత్తం.