Begin typing your search above and press return to search.
సైఫ్‌పై కోపం.. `ఆదిపురుష్`కు మంట పెట్టేశారా?!
By: Tupaki Desk | 3 March 2021 4:30 PM GMTఒకటి కాదు.. పది కాదు..ఏకంగా కోట్ల రూపాయల.. విలువ చేసే అతిభారీ సెట్. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ.. `ఆదిపురుష్` కోసం వేసిన సెట్ అది. అయితే.. అది కొన్ని వారాల కిందట అనూహ్యంగా తగలిబడి పోయింది. ఈ వార్త అప్పట్లో భారీ ఎత్తున వైరల్ అయింది. సహజంగానే.. సినిమా సెట్స్‌లో ప్రమాదాలు సంభవిస్తాయని.. ఈ క్రమంలోనే ఈ సెట్ కూడా కాలిపోయిందని అందరూ భావించారు. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ మీడియా లో దీనిలో కుట్ర కోణం ఉంది అని కొత్త ప్రచారం మొదలు అయ్యింది
అసలు ఏం జరిగింది? సెట్ తగలబడి పోవడానికి కారణం ఏంటి? అనే విషయాలపై రకరకాల పుకార్లు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యాయి . అసలు కొత్తగా స్టార్ట్ అయిన ప్రచారం ఏంటి అంటే "ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడు పాత్రను ధరిస్తున్నాడు. ఉత్తరాది నటుడు.. సైఫ్ ఆలీఖాన్ రావణుడి పాత్రను ధరించేందుకు అంగీకరించారు. అయితే .. కోట్ల విలువైన సెట్ కాలిపోయిన దరిమిలా.. సైఫ్ ఆలీఖాన్ రావణ పాత్రను గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కొందరికి నచ్చలేదు. సైఫ్ భావాలనో, మాటలలోని అర్థాలనో కొందరు వ్యతిరేకించారు. కొందరు బైట పడ్డారు. సోషల్ మీడియాలో రేగిన దుమారాన్ని చూసి, సైఫ్ కూడా కొంచెం ఖంగుతిన్నాడు. తన తప్పు తెలుసుకుని, బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. కానీ వ్యతిరేకులలో ఆగ్రహజ్వాలలు ఆరిపోలేదని, అందుకు ఈ అగ్నిప్రమాదమే నిదర్శనమని అని బాలీవుడ్ మీడియా లో ప్రచారం జరుగుతుంది
అంటే.. ఆదిపురుష్ సినిమాలో నటుడు సైఫ్ ఆలీఖాన్ .. నటించడం ఇష్టంలేని కొందరు ఈ పనిచేశారని బాలీవుడ్ మీడియా లో ప్రచారం జరుగుతుంది . అయితే.. దీనిని పోలీసులు కానీ.. సంబంధిత అధికారులు కానీ.. ఆదిపురుష్ టీం కానీ నిర్ధారించలేదు. కానీ.. ఇది మాత్రం కుట్ర పూరితంగానే జరిగిందని ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్టు బాలీవుడ్ మీడియా చెబుతుంది . ఇదే నిజమైతే.. సినిమాల్లోనూ మత విద్వేషాలు మొలకెత్తినట్టుగానే భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం.. ఇండస్ట్రీకి మంచిది కాదని.. కూడా సూచిస్తున్నారు. ఈ ప్రచారం మీద చిత్రం టీం , అధికారులు స్పందించాలిసి ఉంది